టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది.

టాలీవుడ్ అందమైన ఫిమేల్ యాంకర్స్ లో శ్యామల ఒకరు. అచ్చ తెలుగు వనితలాగా కనిపిస్తూ శ్యామల ఆకట్టుకుంటూ ఉంటుంది. శ్యామల యాంకరింగ్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తోంది. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా మెరిసింది. 

అనసూయ, రష్మీ, శ్రీముఖి తరహాలో శ్యామల అతిగా గ్లామర్ ఎక్స్ పోజ్ చేయదు. నటుడు నరసింహారెడ్డిని శ్యామల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరు సంతోషంగావైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు. శ్యామల కెరీర్ ని, పర్సనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేస్తూ వెళుతోంది. 

శ్యామల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం. శ్యామల తన ఫ్యామిలీ విశేషాల్ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్యామల చేసిన పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. కొత్త ఇంటికి భూమి పూజ చేస్తున్న ఫోటోలని అభిమానులతో పంచుకుంది. 

ఈ ఫొటోల్లో శ్యామల ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. తన భర్త నరసింహతో కలసి శ్యామల భూమి పూజలో పాల్గొంది. సాంప్రదాయ వస్త్రధారణలో ఈ దంపతులు ఇద్దరూ భూమి పూజ చేశారు. అయితే ఈ పోస్ట్ వల్ల కూడా శ్యామల ట్రోలింగ్ కి గురవుతోంది. ఆ మధ్యన కూడా శ్యామల కొత్త ఇల్లు కట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. 

View post on Instagram

2021లో శ్యామల, నరసింహ దంపతులు విలాసవంతమైన ఇంటిని కట్టుకున్నారు. ఆ ఇంటి గృహప్రవేశానికి సంబందించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఆ వేడుకకి రాజీవ్ కనకాల, కమెడియన్ అలీ లాంటి వారు కూడా హాజరయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు శ్యామల ఫ్యామిలీ మరో కొత్త ఇంటికి భూమి పూజ చేశారు. దీనితో ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతు అవుతోంది. 

మొన్నే కదా విలాసవంతమైన ఇంట్లోకి మారారు. ఇప్పుడు మరో ఇల్లా.. శ్యామల ఫ్యామిలీ కి డబ్బు ఎలా వస్తోంది.. ఆ సీక్రెట్ కొంచెం చెప్పరూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంత తక్కువ టైం లో రెండు ఇల్లు కట్టుకోవడం స్టార్స్ కి కూడా సాధ్యం కాదేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి శ్యామల తాజాగా భూమి పూజ చేసింది కొత్త ఇంటి నిర్మాణం కోసమేనా లేక ఏదైనా బిల్డింగ్ కట్టి బిజినెస్ చేయబోతోందా అనేది క్లారిటీ లేదు.