హీరోయిన్ల వస్త్రధారణపై ఇటీవల ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎక్స్ పోజ్ చేసే బట్టలు వేసుకొని నిర్మాతలకు ఎర వేస్తున్నట్లు అర్ధం వచ్చే విధంగా మాట్లాడారు.

ఈ విషయంలో కొందరు ఎస్పీ బాలుని తిడుతుంటే మరికొందరు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. నటుడు నాగబాబు ఈ విషయంలో ఎస్పీ బాలుపై ఫైర్ అయ్యారు. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే హక్కు మీకు లేదంటూ క్లాస్ పీకారు. నాగబాబు మాటలను యాంకర్ రష్మి సపోర్ట్ చేసింది.

ఆడవాళ్లకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన నాగబాబుకి థాంక్స్ కూడా చెప్పింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ నెటిజన్ 'మగవాళ్ల డ్రెస్సింగ్ లో మీకు నచ్చని అంశాలు ఏంటని?' రష్మిని అడిగారు.

దానికి స్పందించిన రష్మి.. ''నాకు షార్ట్స్ వేసుకొని కాళ్లపై హెయిర్ తో తిరిగేవారంటే నచ్చదు. కట్ బనియన్లు వేసుకొని తన శరీరంపై ఉన్న హెయిర్ ని ఎక్స్ పోజ్ చేస్తే నచ్చదు. హాఫ్ షర్ట్స్ వేసుకొని తిరిగే అబ్బాయిలు కూడా నచ్చరు. బీచ్ లలో చొక్కా లేకుండా తిరిగే వాళ్లంటే అసలు నచ్చదు. నా లిస్ట్ చాలా పెద్దది'' అంటూ చెప్పుకొచ్చింది.