యాంకర్ రష్మీ గౌతమ్ ట్రెండీ సాంగ్ కి ఇంస్టాగ్రామ్ రీల్ చేయగా వైరల్ గా మారింది. సాంగ్ లో ఆమె స్టైలిష్ వాక్ ప్రశంసలు అందుకుంటుంది.

జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్(Rashmi Gautam) బుల్లితెరపై సందడి చేస్తున్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో రష్మీ యాంకర్ గా అలరిస్తున్నారు. బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న ఆమె టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. హీరోయిన్ గా కూడా పలు చిత్రాలు చేసిన రష్మీ ఇంస్టాగ్రామ్ వేదికగా వీడియోలు, ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో ఆమెను మిలియన్స్ లో అభిమానులు అనుసరిస్తున్నారు . వారి కోసం ఆమె తరచుగా ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆమె సోషల్ మీడియా ట్రెండీ సాంగ్ కి ఇంస్టాగ్రామ్ రీల్ చేశారు. 

ఇక రష్మీ ఇంస్టాగ్రామ్ రీల్ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రష్మీ స్టైలిష్ వాక్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నారు. కాగా రష్మీ జబర్దస్త్ నుండి వెళ్లిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనసూయ ఇప్పటికే జబర్దస్త్ వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వారం ఎపిసోడ్ ఆమెకు చివరిగా తెలుస్తుంది. జబర్దస్త్ టీం లీడర్స్, జడ్జెస్ ఎంతగా బ్రతిమిలాడినా అనసూయ తన నిర్ణయం మార్చుకోలేదని సమాచారం. ముఖ్యంగా రెమ్యూనరేషన్ కారణంగా జబర్దస్త్ ని వీడుతున్నారని సమాచారం. డేట్స్ కుదరక జబర్దస్త్ మానేస్తున్నానని చెప్పిన అనసూయ... స్టార్ మా, జెమినీ ఛానల్స్ లో కొత్త షోస్ చేయడం విశేషం. 

View post on Instagram

రష్మీ కూడా అనసూయ బాటలో వెళ్లే సూచనలు కలవు. రష్మీ జోడి సుడిగాలి సుధీర్ మల్లెమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశాడు. హీరోగా నటుడిగా సినిమాలు చేస్తున్న సుధీర్ స్టార్ మా లో ఓ సింగింగ్ షో యాంకర్ గా చేస్తున్నారు. ఢీ సీజన్ 14 నుండి సుధీర్, రష్మీలను తీసేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్మీ మల్లెమాల నిర్మాణంలో ఉన్న ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తున్నారు. 

ఇక ఈ మధ్య పెళ్లి కుదిరింది అంటూ బాంబు పేల్చింది. అదంతా ప్రోమో కట్ కోసం, ఎపిసోడ్ హైప్ కోసం ఆమె చేసిన జిమ్మిక్కుగా తేలిపోయింది. 34ఏళ్ల రష్మిక పెళ్ళికి ఇంకా టైం ఉందంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు అందరితో చెబుతానని పలుమార్లు రష్మీ తెలియజేశారు. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస చిత్రాలు చేసిన రష్మీ... నెమ్మదించారు. ఆమె హీరోయిన్ గా నటించిన అనేక చిత్రాలు పరాజయం చవిచూడగా కొత్తగా అవకాశాలు రావడం లేదు.