బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె నటించిన 'క్షణం' సినిమా మంచి సక్సెస్ కావడంతో నటిగా అనసూయకి అవకాశాలు పెరిగాయి. ఆమె ప్రధాన పాత్రలో 'కథనం' సినిమాను తెరకెక్కించారు.

ఈ సినిమాకి రాజేష్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ని అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమాకి అనసూయపై పెట్టిన ఖర్చు ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎక్కువ రోజులు కాల్షీట్స్ ఇవ్వనప్పటికీ సినిమాలో తన పాత్ర కోసం రూ.35 లక్షల రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది అనసూయ. 

నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని ఇచ్చారట. అది కాకుండా కేవలం ఆమె కాస్ట్యూమ్స్ కోసం మరో ఇరవై లక్షల రూపాయలు ఖర్చు చేశారట. రూ.35 లక్షల రెమ్యునరేషన్ అంటే కాస్త పేరున్న హీరోయిన్లను తీసుకోవచ్చు..కానీ అనసూయకి సూటయ్యే పాత్ర కావడంతో ఆమెనే ఎంపిక చేసుకున్నారట. ఇంత రెమ్యునరేషన్ తీసుకొని కూడా అమ్మడు దర్శకనిర్మాతలను ఇబ్బంది పెట్టినట్లు సమాచారం.

సినిమా ప్రమోషన్స్ సమయంలో ఫోన్లు లిఫ్ట్ చేయకుండా.. చెప్పిన సమయానికి రాకుండా దర్శకుడితో ఓ ఆట ఆడుకుందట ఈ బ్యూటీ. ఈమె సంగతి తెలియక హీరోయిన్ గా పెట్టుకున్నానంటూ దర్శకుడు లబోదిబోమంటున్నాడు.గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కనీసపు ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.