దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో దర్శకుడు మహి వి రాఘవ్ 'యాత్ర' అనే బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ కి తగ్గట్లుగా సినిమా ఎక్కువ శాతం వైఎస్ పాదయాత్ర మీదే సాగనుంది.

వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. తన పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా నటిస్తోంది. 

షూటింగ్ సమయంలో తీసిన అనసూయ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చీర కట్టుకొని, జడ వేసుకొని వెనుక నుండి చాలా పద్దతిగా కనిపిస్తోంది అనసూయ. ఈ సినిమాలో ఆమె జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.

అనసూయ పాటు ఈ సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, సుహాసిని, సచిన్ ఖేడ్కర్ వంటి నటులు కనిపించనున్నారు. వచ్చే నెల డిసంబర్ 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.