కొద్ది రోజులుగా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ గురించి విపరీతమైన చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుసినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే హీరోయిన్లను నిర్మాతలు, దర్శకులు హీరోలు అవకాశాల పేరుతో వాడుకోవడం.. వాళ్ల కమిట్మెంట్‌కి లొంగకపోతే హీరోయిన్‌గా అవకాశాలు లేకుండా చేయడం లాంటి విమర్శలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా తెలుగు సినీ పరిశ్రమపై నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో పడుకుంటేనే కానీ అవకాశాలు రావంటూ సన్సేషనల్ కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి.. వాళ్లు వాడుకోవడమే కాకుండా రాజకీయనాయకుల దగ్గరకు కూడా పంపుతారని.. అలా చేసిన దర్శకులు, నిర్మాతలు, హీరోలు చాలా మంది ఉన్నారని సమయం వచ్చినప్పుడు ఆధారాలు బయటపెడతానని చీకటిబాగోతాన్ని బయటపెట్టింది.

 

అయితే శ్రీరెడ్డి ఇటీవల పలు టీవీ చర్చాకార్యక్రమాల్లో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని ఇక్కడ నెగ్గుకురావడం చాలా కష్టం, యాంకర్ అనసూయ వీటన్నింటినీ దాటి రాణిస్తున్నారంటూ అనసూయ పేరును ప్రస్తావించారు శ్రీరెడ్డి. అయితే గతంలో అనసూయ, శ్రీరెడ్డి, గాయత్రీ గుప్తాలు కలిసి ఓ ప్రముఖ ఛానల్‌లో పనిచేసిన విషయాన్ని మీడియాకు వివరించారు. అయితే అసందర్భంగా నా పేరు తెరపైకి తీసుకురావాల్సి అవసరం ఏంటంటూ శ్రీరెడ్డిపై ఫైర్ అయ్యిందట అనసూయ.

 

ఈ విషయం గురించి శ్రీరెడ్డి క్లారిటీ ఇస్తూ.. తాను అనసూయ గురించి తప్పుగా మాట్లాడలేదని, తెలుగు వాళ్లు నెగ్గుకురాలేరని అందరూ అంటుంటే అనసూయ నెగ్గుకొచ్చిందని తన గురించి మంచిగానే చెప్పానన్నారు. నేను పోరాటం చేస్తుంది మహిళలకోసం . తనూ ఓ మహిళే.. ఆమెకు ఇష్టం లేకపోతే ఇంకోసారి ఆమె గురించి మాట్లాడను అంటూ అనసూయతో ఉన్న తాజా వివాదంపై క్లారిటీ ఇచ్చింది శ్రీ రెడ్డి. 


 

ప్రస్తుతం అనసూయ రంగస్థలం మూవీలో రామ్ చరణ్‌కు అత్తగా కీలకపాత్రలో నటించింది. ఈ మూవీ మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.