యాంకర్ గా బుల్లితెరకి అల్లాడించిన అనసూయ.. సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించింది. 'సోగ్గాడే చిన్ని నాయన', 'క్షణం' వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్తగా కనిపించి అందరినీ అలరించింది.

ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా అనసూయకి ఫ్యాన్స్ పెరిగిపోయారు. డీ గ్లామరస్ రోల్ లో కనిపించడానికి ఈమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తుందని అంటున్నారు. ఇటీవల విడుదలైన 'యాత్ర' సినిమాలో అనసూయ గౌరు చరితా రెడ్డి పాత్రలో కనిపించింది.

కథ ప్రకారం ఆ పాత్రకి పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో క్యారెక్టర్ పెద్దగా క్లిక్ అవ్వలేదు. కానీ అనసూయ మాత్రం ఇంతమంచి క్యారెక్టర్ చేసినందుకు సంతోషంగా ఉందని, ఇలానే మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఇటీవల విడుదలైన 'ఎఫ్ 2' సినిమాలో కూడా అనసూయ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.

అసలు ఇలాంటి పాత్రలో అనసూయ ఎలా చేసిందంటూ కామెంట్స్ వచ్చాయి. షార్ట్ రోల్స్ లో తమ అభిమాన తార కనిపించడంతో అనసూయ అభిమానులు బాగా హర్ట్ అవుతున్నారు. భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు ఎంపిక చేసుకుంటుందో.. అనే ఆందోళన వారిలో మొదలైంది!