యాంకర్ గా, నటిగా అనసూయ దూసుకుపోతోంది. అనసూయ గ్లామర్ తో పాటు నటన పరంగా కూడా ఆకట్టుకుంటుండడంతో నటిగా ఆమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. క్షణం, రంగస్థలం లాంటి చిత్రాలతో అనసూయ క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం అనసూయ కథనం అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. 

సినిమాల్లో నటిస్తూనే జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తోంది. కెరీర్ జోరుగా సాగుతున్న సమయంలో అనసూయ తన సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం అనసూయ అమెరికాలో జరుగుతున్న తానా సభలకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను నిర్మాతగా మారబోతున్నట్లు అనసూయ ప్రకటించింది. 

కొత్త టాలెంట్ ని ప్రోత్సహించేందుకు తాను సినిమాలు నిర్మిస్తానని అనసూయ తెలిపింది. అనసూయ సినిమాలు నిర్మించే ఆలోచనని భవిష్యతులో అమలు చేస్తుందా లేక ప్రస్తుతం ఏదైనా ప్రాజెక్ట్ సిద్ధంగా ఉందా అనేది తెలియాల్సి ఉంది. యాంకర్ స్థాయి నుంచి నటిగా ఎదుగుతున్న సమయంలో అనసూయ తీసుకున్న నిర్ణయం సంచలనమైనదే.