Asianet News TeluguAsianet News Telugu

క్రేజీ హీరోతో లైగర్ బ్యూటీ లవ్ ఎఫైర్.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ కెమెరాకి చిక్కిన అనన్య పాండే, వీడియో

సన్నని మెరుపు తీగ లాంటి పిల్ల అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

Ananya Panday enjoying with her boy friend adirya roy  dtr
Author
First Published Jul 20, 2023, 11:33 AM IST

సన్నని మెరుపు తీగ లాంటి పిల్ల అనన్య పాండే. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంతో అనన్య పాండే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎంత దారుణ పరాజయాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే అనన్య మాత్రం నాజూకు అందాలు ఆరబోస్తూ.. విజయ్ దేవరకొండతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది. 

పాన్ ఇండియా లెవల్ లో తనకి గుర్తింపు తెస్తుంది అనుకున్న లైగర్ చిత్రం తీవ్రంగా నిరాశ పరచడంతో అనన్యకి తెలుగులో మరో ఆఫర్ రాలేదు. ఆమె బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. అనన్య పాండే తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇటీవల నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయిన యువ నటుడు ఆదిత్య రాయ్ కపూర్ తో అనన్య పాండే పీకల్లోతు ప్రేమలో ఉంది. 

 

బాలీవుడ్ లో వీరిద్దరి లవ్ ఎఫైర్ గురించి హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. అయితే తరచుగా అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట పోర్చుగల్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. 

అక్కడ వీరిద్దరూ వన్ వీల్ స్కూటర్ రైడ్ చేస్తూ ఎంజయ్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే రెస్టారెంట్ లో కూర్చుని ప్రేమగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటున్న పిక్చర్స్ కూడా నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. అదిర్య రాయ్ కపూర్ ఇటీవల విడుదలైన నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ లో స్టైలిష్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. శోభిత ధూళిపాలతో కలసి బోల్డ్ సీన్స్ లో రొమాన్స్ కూడా చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios