Baby Day1 Collections : మొదటిరోజే అదరగొట్టిన ‘బేబీ’.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. డిటేయిల్స్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) లేటెస్ట్ ఫిల్మ్ ‘బేబీ’ థియేటర్లలో సందడి చేస్తోంది. నిన్న రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను అందుకుంది. వరల్డ్ వైడ్ గా వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
యంగ్ స్టార్ ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం ‘బేబీ’ (Baby). గీతా ఆర్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కెఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిన్న ఈ మూవీ విడుదలైంది. యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. సాయి రాజేశ్ రచన, దర్శకత్వానికి మంచి రివ్యూస్ దక్కాయి. నటీనటుల పెర్ఫామెన్స్ కూ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొత్తానికి ఆడియెన్స్ నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రం దుమ్ములేపింది. తాజాగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ కలెక్షన్ల వివరాలను ట్రేడ్ వర్గాలు ఇలా వెల్లడించారు.
మొదటిరోజు ఈ సినిమా ఓపినింగ్స్ అదిరిపోయాయి. యూత్ కంటెంట్ కావడంతో థియేటర్లకు భారీగా తరలి వస్తున్నారు. ఇటీవల ఇలాంటి సినిమాలు లేకపోవడంతో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫలితంగా ‘బేబీ’ కాసుల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు కలెక్లన్ల విషయానికొస్తే... ఏరియా వైజ్ గా డిటేయిల్స్ ఇలా ఉన్నాయి.
నిజాం : 2,37,79,786
వైజాగ్ : 80,08,612
తూర్పు : 40,61,593
వెస్ట్ : 21,64,380
కృష్ణ : 34,61,956
గుంటూరు : 29,33,005
నెల్లూరు : 17,83,404
సెడెడ్ : 54,72,086
కర్ణాటక + ROI : 20,32,212
ఓవర్సీస్ : 1,74,00,000
మొత్తం : 7,10,97,034
తొలిరోజే బేబీ చిత్రానికి ఇంతటి గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ఇటీవల చిన్న సినిమాలు ఈస్థాయిలో ఓపెనింగ్స్ ను దక్కించుకున్నది తక్కువనే చెప్పాలి. ఇక ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ నైజాంలో రూ. 2.25 కోట్లు, ఆంధ్రాలో రూ. 2.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 1.35 కోట్లు బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా రూ. 7.40 కోట్లు మేర బిజినెస్ చేసిందని తెలుపుతున్నారు. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 8.00కోట్లుగా ఫిక్సైంది. మొదటి రోజు కలెక్షన్లతోనే చాలా వరకు ‘బేబీ’ రికవరీ చేసింది. రెండో రోజుతో ఈ టార్గెట్ రీచ్ కానుంది.