విజయదేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా  పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రం జస్ట్ ఓకే టాక్ తెచ్చుకుంది. సినిమాకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. చాలా స్లోగా ఉందని, సినిమా విసిగిస్తోందని రివ్యూలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆనంద్ దేవరకొండ కెరీర్ ..ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే సినిమాకు టాక్ ఎలా ఉన్నా...ఆనంద్ కు మంచి మార్కులే పడ్డాయి. దాంతో రెండో సినిమాకోసం నిర్మాతలు ఆల్రెడీ ఆనంద్ ని ఎప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. 

 అందుతున్న సమాచారం మేరకు  ఆనంద్‌ దేవరకొండ రెండో సినిమాకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ కూడా ప్రారంభమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. భవ్యక్రియేషన్స్‌ బ్యానర్‌ పై  కొత్త దర్శకుడితో ఆనంద్‌ రెండో సినిమా ఉంటుందంటున్నారు. అలాగే  విజయ్‌ దేవరకొండ  కోసం దర్శకుడు తయారు చేసుకున్న కథనే ఆనంద్‌ కోసం తీసుకున్నారన్న చెప్పుకుంటున్నారు.  అన్నీ సెట్ అయితే ఈ నెలలోనే ఈప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. 

ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ... నా తర్వాతి సినిమా కోసం రెండు కథలు విన్నాను. వాటిల్లో వినోద్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఒకటి. ఆగస్టులో ఈ సినిమా ప్రారంభించాలనుకుంటున్నాం. నాకు ఏదైనా పాత్ర కరెక్టుగా సరిపోతుందని అన్నయ్యకి అనిపించి, నన్ను చేయమని సలహా ఇస్తే తప్పకుండా చేస్తా అన్నారు.