విజయ్‌ దేవరకొండ తమ్ముడు, `దొరసాని`, `మిడిల్‌క్లాస్‌మెలోడీస్‌` చిత్రాలతో ఆకట్టుకున్న ఆనంద్‌ దేవరకొండ మరో సినిమాని ప్రారంభించాడు. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేసిన కేవీ గుహ‌న్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయన ఇప్పటికే `118`చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆనంద్‌తో `హైవే` పేరుతో సినిమాని తెరకెక్కించబోతున్నాడు. రోడ్‌ జర్నీ నేపథ్యంలో సైకో కిల్లర్‌-క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట.  శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా నిర్మాత వెంకట్‌ తలారి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని గురువారం  సంస్థ కార్యాల‌యంలో ప్రారంభమైంది. 

ముహూర్త‌పు స‌న్నివేశానికి తుంగ‌తుర్తి ఎంఎల్ఎ గాద‌రి కిశోర్‌కుమార్ క్లాప్ కొట్టగా,  ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రం కెమెరా స్విచాన్ చేశారు. మొద‌టి స‌న్నివేశాన్ని హీరో ఆనంద్‌ దేవ‌ర‌కొండ‌పై చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు కేవీగుహ‌న్‌. సైమ‌న్ కె.కింగ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్‌ షూటింగ్ జూన్ ఫ‌స్ట్ వీక్ నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎంఎల్ఎ గాద‌రి కిశోర్‌కుమార్ మాట్లాడుతూ, `ఈ చిత్ర నిర్మాత వెంక‌ట్ త‌లారి నాకు అత్యంత స‌న్నిహితుడు. గుహ‌న్ కి సినిమా అంటే చాలా ప్యాష‌న్. కెమెరామేన్‌గా ఎంతో ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న గుహ‌న్ తో ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా రూపొందుతోన్న ఈ మూవీ మంచి విజ‌యం సాధించాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా` అని అన్నారు. 


హీరో ఆనంద్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ, `నేను ఫ‌స్ట్ టైమ్ ఒక ఎక్స్‌పీరియ‌న్స్‌డ్ డైరెక్ట‌ర్‌తో వ‌ర్క్ చేస్తున్నా. గుహ‌న్ గారు సూప‌ర్ కెమెరామేన్‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. ఈ జ‌ర్నీలో నేను చాలా కొత్త విష‌యాలు నేర్చుకుంటాన‌నే న‌మ్మ‌కం ఉంది. త‌ప్ప‌కుండా ఒక గ్రేట్ మూవీ అవుతుంది` అని చెప్పారు. ద‌ర్శ‌కుడిగా విభిన్న‌చిత్రాలు అందిస్తున్న కేవీ గుహ‌న్ మాట్లాడుతూ, `ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా నేను డైరెక్ట్ చేస్తోన్న`హైవే` ప్రీ ప్రొడ‌క్ష‌న్ దాదాపుగా పూర్త‌య్యింది. ఆర్టిస్టుల‌, టెక్నీషియ‌న్స్ సెల‌క్ష‌న్ జ‌రుగుతోంది. జూన్ ఫ‌స్ట్ వీక్ నుండి  రెగ్యుల‌ర్ షూటింగ్ ప్లాన్ చేశాం. త్వ‌ర‌లో మ‌రికొంత మంది ఫేమ‌స్‌ ఆర్టిస్టుల‌తో మిమ్మ‌ల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తాం` అని చెప్పారు. 

నిర్మాత వెంక‌ట్ త‌లారి మాట్లాడుతూ, ``చుట్టాల‌బ్బాయి` లాంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత మా బ్యానర్‌లో చేస్తున్న రెండో చిత్రమిది.  గుహ‌న్‌ చెప్పిన క‌థ చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. హైవే నేప‌థ్యంలో ఒక సైకో క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రం త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది. కొంత మంది ఫేమ‌స్ ఆర్టిస్టులు ఈ సినిమాలో న‌టించ‌నున్నారు. వారి వివరాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం` అని చెప్పారు. గెస్ట్ గా వచ్చిన ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భద్రం మాట్లాడుతూ, `త‌లారి వెంక‌ట్‌తో నేను డైరెక్ట్ చేసిన తొలిచిత్రం `చుట్టాల‌బ్బాయి` పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు గుహ‌న్‌ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న తీస్తున్న రెండ‌వ చిత్రం `హైవే` పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా` అని తెలిపారు.