Asianet News TeluguAsianet News Telugu

అన్నదారిలోనే తమ్ముడు.. సగం బిల్ నాది అంటున్న విజయ్ దేవరకొండ

ఆనంద్‌ దేవరకొండ సైతం అన్న దారిలోనే వెళ్తున్నారు. ఇటీవల `మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌`తో సక్సెస్‌ కొట్టిన ఆనంద్‌ వెంటనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న `గుడ్‌ వైబ్స్ ఓన్లీ` కేఫ్‌లో భాగమయ్యారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఈ కేఫ్‌ని రన్‌ చేస్తున్నారు.

anand devarakonda enter into food business  arj
Author
Hyderabad, First Published Nov 26, 2020, 6:54 PM IST

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ `అర్జున్‌రెడ్డి`, `గీతగోవిందం`తో తనకి వచ్చిన ఇమేజ్‌, క్రేజ్‌తో తాను కలలు కన్న కోరికని నెరవేర్చుకున్నారు. రౌడీ వేర్‌ పేరుతో ఫ్యాషన్‌ బ్రాండ్లని ప్రారంభించారు. దీనికి మంచి పాపులరిటీ వచ్చింది. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ కంపెనీలో భాగస్వామి అయ్యారు. ఇప్పుడు ఆయన సోదరుడు ఆనంద్‌ దేవరకొండ సైతం అన్న దారిలోనే వెళ్తున్నారు. ఇటీవల `మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌`తో సక్సెస్‌ కొట్టిన ఆనంద్‌ వెంటనే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. 

తన ఫ్రెండ్స్ నిర్వహిస్తున్న `గుడ్‌ వైబ్స్ ఓన్లీ` కేఫ్‌లో భాగమయ్యారు. హైదరాబాద్‌లోని ఖాజాగూడలో ఈ కేఫ్‌ని రన్‌ చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆనంద్‌ దేవరకొండ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు. `నేను మా అన్నయ్య విజయ్‌ ఇద్దరం ఫుడ్‌ బేస్డ్ మూవీస్‌తోనే మంచి సక్సెస్‌ అందుకున్నాం. `మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌` ద్వారా వచ్చిన నా రెమ్యూనరేషన్‌ను ఈ ఫుడ్‌ బిజినెస్‌లోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ కలిసి నిర్వహిస్తున్న `గుడ్‌ వైబ్స్ ఓన్లీ` కేఫ్‌లో భాగస్వామి కావడం హ్యాపీగా ఉంది. మీ ప్రేమ వల్లే మా కలలను నెరవేర్చుకోగలుగుతున్నా`మని తెలిపారు. 

దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ, ``మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌`సినిమా విజయం సాధించిన సంతోషంలో ఉన్నాను. నేను నా ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. అందుకే ఈ వీకెండ్‌ `గుడ్‌ వైబ్స్ ఓన్లీ` కేఫ్‌కు వచ్చే మీ కోసం సగం బిల్‌ నేను చెల్లిస్తాను. ఈ సందర్భంగా అందరికి స్వాగతం. బిల్‌ నాది` అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆనంద్‌ దేవరకొండ ఇటీవల `ఏషియా నెట్‌`తో మాట్లాడుతూ, ఇప్పట్లో బిజినెస్‌ వైపు వెళ్లాలనుకోవడం లేదు, హీరోగా సెటిల్‌ అయ్యాక` వ్యాపారాల గురించి ఆలోచిస్తా` అని తెలిపిన విషయం తెలిసిందే. సక్సెస్‌ ఏదైనా చేయిస్తుందనడానికి నిదర్శనమిది. 

Follow Us:
Download App:
  • android
  • ios