తెలుగు ఎంట‌ర్‌టైన్‌మెంట్   బిగ్గెస్ట్ గేమ్ చేజింగ్ అనౌన్స్‌మెంట్ ఓటీటి. ఈనాటి యూత్ ఆలోచ‌న‌ల‌ను, అభిరుచిని ప్రతిబింబిస్తూ..  కొత్త కంటెంట్‌తో సినిమా రంగానికి ధీటుగా డిజిట‌ల్ రంగంలో అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ కరోనా టైమ్ లో ఓటీటి అనేది అందరికీ అత్యవసరంగా మారింది. తెలుగులో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ5 వంటి ఓటీటిలు దూసుకుపోతున్నాయి. వందకు వంద శాతం ప‌క్కా తెలుగు కంటెంట్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు అందించటానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకోసం తెలుగు సినిమాల రైట్స్ తీసుకుంటున్నాయి. 

రిలీజ్ కాని కొత్త సినిమాల రైట్స్ సైతం సొంతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వడ్డీల భారంతో చాలా మంది నిర్మాతలు అందుకు మొదట ఊగినా..హీరోలకు అది ఇంట్రస్ట్ లేకపోవటంతో వెనక్కి తగ్గారు. కాని కొందరు మాత్రం ఓటీటి అయినా తమకు నష్టం లేదని, ఉన్నంతలో బయిటపడటమే లక్ష్యంగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో  ‘అమృతారామమ్‌’ అనే టైటిల్ తో రూపొందిన ఓ చిత్రం ఏప్రియల్ 29న మొదటగా రిలీజ్ కాకుండా తమ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తున్నారు. జీ5లో ఈ సినిమాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. లౌక్ డౌన్ కారణంగా తాము ఇలా రిలీజ్ కాకుండానే స్ట్రీమింగ్ కు ఇచ్చేసామని చెప్తున్నారు నిర్మాతలు. 
   
నూతన దర్శకుడు సురేందర్‌ దర్శకత్వంలో రామ్‌ మిట్టికంటి హీరోగా అమితా రంగనాథ్‌ హీరోయిన్ గా రాబోతున్న ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ ‘అమృతారామమ్‌’.   ప్రేమకథా నేపథ్యంలో ప్యూర్ ఫీల్ గుడ్ తో సాగే పక్కా లవ్ ఎమోషనల్ డ్రామాగా అని తెలుస్తోంది. నిర్మాత ఎస్‌.ఎన్‌ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ సంస్థ విడుదల చేద్దామనుకుంది. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా పై నెటిజన్లల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఓటీటిలో చూడాల్సిందే.