బిగ్ బాస్ హౌస్ నుండి నిన్న అమ్మ రాజశేఖర్ ఎలిమినేటైన సంగతి తెలిసిందే. ఈ వారానికి గానూ అతి తక్కువ ఓట్లు దక్కించుకున్న అమ్మ రాజశేఖర్ ఎలిమినేటైనట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. హౌస్ నుండి బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన అమ్మ రాజశేఖర్ అభిజిత్ మినహా అందరి పట్ల సదాభిప్రాయం వ్యక్తం చేశాడు. 

ఇక బిగ్ బాస్ నుండి ఎలిమినేటైన అమ్మ రాజశేఖర్ బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు. గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో ఆయన పాల్గొనడం జరిగింది. ఇక ఇంటి సభ్యులపై అమ్మ రాజశేఖర్ తన అభిప్రాయం తెలియజేశాడు. అభిజిత్ పై అమ్మ రాజశేఖర్ షాకింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. హౌస్ లో ఉన్న వాళ్లలో అభిజిత్ వేస్ట్ అని అమ్మ రాజశేఖర్ అన్నారు. కనీసం హౌస్ లో నేనున్నా టీఆర్పీ వస్తుంది, అభిజిత్ వలన ఎటువంటి ప్రయోజనం లేదని అమ్మ రాజశేఖర్ అన్నారు. 

అమ్మ రాజశేఖర్ కి అభిజిత్ కి హౌస్ లో అనేక మార్లు గొడవ జరిగింది. అనేక విషయాలలో వీరి మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. ఇక లాస్య పైకి ఒకలా, లోపల ఒకలా ఉంటారని చెప్పారు. నోయల్ ని ఫేక్ అని తేల్చివేశాడు. హారిక గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్ మాట్లాడితే కనెక్ట్ అయిపోతుందని, అమ్మ రాజశేఖర్ తెలియజేశారు.