బిగ్‌బాస్‌ 4 రెండో వారం ఎలిమినేషన్‌ ప్రారంభమైంది. పదమూడో రోజు ప్రారంభంలోనే ఎలిమినేషన్‌కి నామినేషన్‌ అయిన తొమ్మిది మందికి బిగ్‌బాస్‌ నాగ్‌ క్లాస్‌ పీకారు. హౌజ్‌లోకి వచ్చింద గేమ్‌ ఆడటానికా? వెళ్ళిపోవడానికా? అంటూ ఫైర్‌ అయ్యారు. తనదైన స్టయిల్‌లో అందరికి క్లాప్‌ పీకాడు. ఊహించని పరిణామంతో సభ్యులంతా షాక్‌కి గురయ్యారు. 

రెండో వారంలో ఎలిమినేషన్‌ నుంచి గంగవ్వ సేఫ్‌ అని చెప్పేశాడు. దీంతో ఆమె ఉంటుందా? పోతుందా? అనే అనుమానాలకు, సస్పెన్స్ కి తెరపడింది. 

ఇక హీరో, జీరో ఎపిసోడ్‌ ఆసక్తిని రేకెత్తించింది. ప్రతి ఒక్క కంటెస్టెంట్‌ని పిలిచి హీరో ఎవరో, జీరో ఎవరో చెప్పాలని చెప్పాడు నాగ్‌. ఒక్కొక్కరు తమకి హీరోగా అనిపించిన వాళ్ళు ఎవరో, జీరోగా అనిపించిన వాళ్ళు ఎవరో చెప్పారు. 

హీరో.. జీరో ఎపిసోడ్‌లో మొదటగా నోయల్‌ తన అభిప్రాయం చెబుతూ, అమ్మ రాజశేఖర్‌ హీరో అని, కుమార్‌ సాయి జీరో అని తెలిపారు. సుజాత చెబుతూ, అమ్మ రాజశేఖర్‌ హీరో అని, కళ్యాణి జీరో అని తెలిపారు. సోహైల్‌ చెబుతూ, నోయల్‌ హీరో అని, కళ్యాణి జీరో అని చెప్పారు. 

దేవి నాగవల్లి చెబుతూ, అరియానా హీరో అని, అమ్మ రాజశేఖర్‌ జీరో అన్నారు. మెహబూబ్‌ చెబుతూ, లాస్య హీరో అని, కుమార్‌ సాయి జీరో అని చెప్పాడు. కుమార్‌ సాయి చెబుతూ, అభిజిత్‌ హీరో అని, నోయల్‌ జీరో అని చెప్పాడు. దేత్తడి హారిక చెబుతూ, అభిజిత్‌ హీరో అని, కుమార్‌ సాయి జీరో అని, లాస్య చెబుతూ, గంగవ్వ హీరో అని, అమ్మ రాజశేఖర్‌ జీరో అని చెప్పాడు. 

వీరితోపాటు కరాటే కళ్యాణి చెబుతూ, గంగవ్వ హీరో అని, సుజాత జీరో అని, అఖిల్‌ చెబుతూ, గంగవ్వ హీరో అని, కుమార్‌సాయి జీరో అని, అరియానా తన అభిప్రాయం పంచుకుంటూ గంగవ్వ హీరో అని, కళ్యాణిజీరో అని, అవినాష్‌ స్పందిస్తూ, అమ్మ రాజశేఖర్‌ హీరో అని, కుమార్‌ సాయి జీరో అని, దివి చెబుతూ, అమ్మ రాజశేఖర్‌ హీరో అని, కుమార్‌ సాయి జీరో అని, గంగవ్వ చెబుతూ, నోయల్‌ హీరో అని, కుమార్‌ సాయి జీరో అని, అభిజిత్‌ పంచుకుంటూ గంగవ్వ హీరో అని, అరియానా జీరో అని, అమ్మ రాజశేఖర్‌ తన అభిప్రాయం పంచుకుంటూ నోయల్‌ హీరో అని, దేవి నాగవల్లి జీరో అని, మోనాల్‌ గజ్జర్‌ చెబుతూ, గంగవ్వ హీరో అని, కుమార్‌ సాయి జీరో అని తెలిపారు. 

అయితే లాస్య చెప్పే క్రమంలో అమ్మ రాజశేఖర్‌ ఎమోషనల్‌ అయిపోయాడు. చాలా మంది జీరోగా అమ్మ రాజశేఖర్‌ పేరు చెప్పడంతో ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అంతేకాదు తనని హౌజ్‌ నుంచి పంపించేయమని ప్రాదేయ పడ్డాడు. తనకిది మొదటి అనుభవమని, నన్ను ద్వేషించే వారిని చూడలేదని నాగ్‌ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. దీంతో సభ్యులందరూ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. 

ఆ తర్వాత కూడా అమ్మ రాజశేఖర్‌ కన్నీళ్ళు పెట్టుకున్నారు. దీంతో సభ్యులంతా ఆయన్ని ఓదార్చారు. కామెడీ చేసేవాడు గొప్ప అని అవినాష్‌ అన్నారు. అయితే హీరోగా, జీరోగా వచ్చిన పేర్లలో అత్యధికంగా అమ్మ రాజశేఖర్‌ పేరు ఉందని, ఆయనతో ఇంత మంది ఎలా కనెక్ట్ అవుతున్నారో తెలుసుకో అని నాగ్‌ వివరించారు. దీంతో కాస్త కుదుట పడ్డాడు అమ్మ రాజశేఖర్‌. 

ఇక ఎలిమినేషన్‌లో ఈ వారం ఇద్దరు ఎలిమినేట్‌ అవుతారని నాగ్‌ చెప్పారు. శనివారం ఒకరు, ఆదివారం మరొకరు ఎలిమినేట్‌ అవుతారని చెప్పిన నాగ్‌, శనివారం ఎలిమినేషన్‌ కరాటే కళ్యాణి పేరు చెప్పారు. అందరు ఊహించిన పేరే రావడంతో పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. 

అయితే ఎలిమినేషన్‌ లో తన పేరు చెప్పడంతో కళ్యాణి కన్నీళ్ళు పెట్టుకున్నారు. `ఎలిమినేట్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానని, తన బాబుని చూసుకోవాలని, బయట చాలా పనులున్నాయని తెలిపింది. అంతేకాదు ఇందులో ఉండలేని వెన్నుపోట్లు పొడుస్తున్నారని, అవన్నీ తట్టుకోలేకపోతున్నాన`ని చెబుతూ ఎమోషనల్‌ అయిపోయింది.

సభ్యులందరు ఆమెని దగ్గరుండి ఓదార్చి హౌజ్‌ నుంచి బయటకు పంపించారు. రేపు ఆమె ఆడియెన్స్ తో, నాగ్‌తో మాట్లాడనున్నారు. అదే సమయంలో రేపటి ఎలిమినేషన్‌ ఎవరో అనే సస్పెన్స్ నెలకొంది. అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయి ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండే ఛాన్స్ ఉందనే టాక్‌ వినిపిస్తుంది.