Asianet News TeluguAsianet News Telugu

అమితాబ్ అనుకోకుండా చేసిన పని.. ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'కి పిచ్చ పబ్లిసిటీ, వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన నుంచి ఏడాది వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్.. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 

amitabh bachchan unexpected tweet on Project K
Author
First Published Jan 16, 2023, 2:27 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన నుంచి ఏడాది వరుసగా భారీ చిత్రాలు రాబోతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్.. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అన్ని కుదిరితే నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె కూడా ఈ ఏడాదే రావచ్చు లేకుంటే వచ్చే ఏడాది బిగినింగ్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. 

సీనియర్ నిర్మాత అశ్విని దత్ కనీవినీ ఎరుగని విధంగా ప్రాజెక్ట్ కె చిత్రాన్ని 500 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ లాంటి బాలీవుడ్ బడా స్టార్లు నటిస్తున్నారు. 

ఈ చిత్రం టైం ట్రావెల్, మూడో ప్రపంచ యుద్ధం లాంటి ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ఆల్రెడీ లీకులు వచ్చాయి. ప్రస్తుతానికి ఈ చిత్రాన్ని 'ప్రాజెక్ట్ కె' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా చేసిన ట్వీట్ వైరల్ గా మారుతోంది. అమితాబ్ చేసిన ఈ ట్వీట్ కి ప్రాజెక్ట్ కె చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. కానీ అనుకోకుండా అమితాబ్ ఈ ట్వీట్ లో ప్రాజెక్ట్ కె ప్రస్తావన తీసుకువచ్చారు. 

 

నిన్న ఆదివారం రోజు ముంబైలో తన నివాసం జల్సా గేటు వద్ద అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. వారికి అమితాబ్ అభివాదం చేశారు. ఆ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. అమితాబ్ ధరించిన కోటు ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రానికి సంబందించినది. అమితాబ్ కోటుపై ప్రాజెక్ట్ కె అని రాసి ఉంది. దీనితో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అమితాబ్ ట్వీట్ ని వైజయంతి మూవీస్ సంస్థ కోట్ చేస్తూ 'సంక్రాంతి' అని కామెంట్ పెట్టారు. అనుకోకుండా చేసినప్పటికీ అమితాబ్ ఇలా ప్రాజెక్ట్ కె చిత్రానికి మంచి పబ్లిసిటీ కల్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios