మేజర్ సినిమా చూశారు బిగ్ బీ అమితాబచ్చన్, ఈమూవీపై ట్విట్టర్ లో స్పందించారు. అమితాబ్ స్పందనకు సూపర్ స్టార్ మహేష్ అడవి శేష్ కూడా స్పందించారు. ఇంతకీ అమితాబ్ ఏమన్నారు.. మహేష్ ఏమని రిప్లై ఇచ్చారు. 

టాలీవుడ్ యంగ్ హీరో అడివిశేష్ హీరోగా న‌టించిన సినిమా మేజ‌ర్‌. ముంబై బాంబు దాడుల్లో అమ‌ర వీరుడైన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని శ‌శికిర‌ణ్ టిక్క డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం గ‌త శుక్ర‌వారం విడుద‌లై సంచ‌ల‌న విజయం సాధించింది. మేజ‌ర్ పాత్ర‌లో అడివి శేష్ త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేశాడు. అసలు ఈ పాత్రలో నటించడం కాదు జీవించాడు శేష్. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ఈ మేజర్ భారీ స్థాయిలో క‌లెక్ష‌న్లు సాధిస్తుంది. అడివి శేష్‌కు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా మేజ‌ర్ నిలిచింది. 

ఈమూవీ తరువాత పెద్ద సినిమాలు ఎన్ని వచ్చినా.. క‌లెక్ష‌న్ల జోరు మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. మేజ‌ర్ జీవితం ఎలా సాగింది అని తెలుసుకోవాల‌ని ప్రేక్ష‌కులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేట‌ర్లకు క్యూ కడుతున్నారు. అందులోను ఈమూవీని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించేసరికి అంతా ఈసినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. మరో విషేషం ఏంటి అంటే.. సామాన్యులతో పాటు.. సెలబ్రిటీలు కూడా మేజర్ మూవీపై స్పందిస్తున్నారు.

 ప‌లువురు సినీ ప్ర‌ముఖులు మేజర్ మూవీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ మేజ‌ర్ చిత్రంపై స్పందించాడు. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా మేజ‌ర్ చిత్రం తెర‌కెక్కింది. ఈయ‌న ముంబై 26/11 దాడుల్లో ఎంతో మంది ప్ర‌జ‌ల‌ను కాపాడి అమ‌రుడయ్యాడు. ఈ చిత్రం ఇప్పుడు థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. చిత్ర‌బృందానికి నా బెస్ట్ విషెస్ అంటూ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు. 

Scroll to load tweet…

ఇక దీనిపై మ‌హేష్‌బాబు, అడివిశేష్ స్పందించారు. మీ ఎంక‌రేజ్‌మెంట్‌కు ధ‌న్య‌వాదాలు అని సూపర్ స్టార్ మ‌హేష్ రిప్లై ఇవ్వ‌గా.. ఇది చాలా గొప్ప విష‌యం, లేజెండ్ స్వ‌యంగా ట్వీట్ చేశాడు అంటూ అడవి శేష్ స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

Scroll to load tweet…

బ‌యోగ్రాఫీక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన‌ ఈ సినిమాను జీఎంబీ ఎంట‌ర్టైన‌మెంట్స్‌ లో సూపర్ స్టార్ మహేష్ బాబ తో కలసిి సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ+ఎయ‌స్ మూవీస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. అడివిశేష్‌కు జోడీగా సాయి మంజ్రేక‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, రేవ‌తి, శోభితా ధూళిపాల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Scroll to load tweet…