ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గలో తెలిసినవారు గొప్పవారు. ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ ఇది నిరూపించారు. తన పై విరుచుకుపడుతున్న ట్రోలర్స్ కు సుతిమెత్తగా సమాధానం చెప్పి..చురకలంటించారు.
అమితాబ్ అంటే ఇష్టపడనివారు ఉండరు. ఆయన కూడా ఏడుపదుల వయస్సులో ఇంకా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నరు. ఎంత బిజీగా ఉన్నా ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో టచ్ లో ఉంటూనే ఉంటారు బిగ్ బీ. ఇక ఈక్రమలో అమితాబ్ కు నెట్టింట్లో ఓ పెద్ద షాక్ తగిలింది. ఊహించని విధంగా ఆయన ట్రోల్స్ కు గురయ్యారు. ఎంత మంది ఎన్ని అన్నా... అమితాబ్ మాత్రం చాలా ఒపిగ్గా సమాధానం చెప్పారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై సోషల్ మీడియా వేదికగా ఓ నెటిజన్ అవమానకర రీతిలో దాడి చేస్తే.. ఏమాత్రం సహనం కోల్పోకుండానే అతడికి బిగ్ బీ బుద్ధి చెప్పారు. ఎప్పటిలాగానే ఆదివారం ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో మాట్లాడే అమితాబ్.. కొంచెం లేటు గా.. ఉదయం దాటిపోతున్న సమయంలో 11.30 గంటలకు గుడ్ మార్నింగ్ అంటూ ట్వీట్ చేశారు. దానిపై కొందరు ట్రోల్స్ మొదలెట్టారు. అందులో భాగంగానే ఓ నెటిజన్ ఇది మధ్యాహ్నం ముసలోడా అంటూ కామెంట్ చేశాడు.
ఈ టైంలో గుడ్ మార్నింగ్‌ఏంటని మరో వ్యక్తి ప్రశ్నించగా.. లేట్ నైట్ షూటింగ్‌తో ఆలస్యం అయ్యిందని, అది పూర్తయ్యే సరికి ఉదయం అయ్యిందని, ఆలస్యంగా లేచినందుకే పోస్ట్ చేశానంటూ బదులిచ్చారాయన. ఇక అగౌరవంగా కామెంట్లు చేసిన వాళ్లకు సైతం అంతే ఘాటుగా బదులిచ్చారు.
ఇంతటితో ఆగకుండా మరో నెటిజన్.... మరో కామెంట్ చేశారు లిక్కర్ తాగి ఉంటాడేమో అందుకే.. ఈ టైంకి గుడ్ మార్నింగ్ పెట్టాడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి అమితాబ్ స్పందిస్తూ.. తాను అసలు ఆల్కాహాల్ తాగనని చెబుతూ.. తన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రాసిన మధుశాలలోని ఓ లైన్ పోస్ట్ చేశారు
ఇది మధ్యాహ్నాం రా ముసలోడా. అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు సుతిమెత్తగా చురక అంటించాడు బిగ్ బీ. దీర్ఘకాలం నువ్వు జీవించాలంటూ ఆశీర్వదించారు. అంతేకాదు నిన్ను మాత్రం ఎవరూ ముసలోడా అంటూ పిలిచి అవమానించకూడదంటూ కోరుకుంటున్నట్లు కౌంటర్ ఇచ్చారు బిగ్ బీ. ఇలా ఎవరైతే తనపై సెటైర్లు వేసేందుకు ప్రయత్నించారో.. వాళ్లందరిపైనా ఆయన తన టాలెంట్ తో అద్భుతమైన రిప్లైలు ఇచ్చారు.
