ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ అంబర్ హార్డ్ ని జానీ డెప్ 2015లో వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత వీరి వివాహ జీవితంలో విభేదాలు తలెత్తాయి. దీనితో ఈ జంట 2017లో విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.

హాలీవుడ్ స్టార్ హీరో జానీ డెప్ నటించిన పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్ ద్వారానే జానీ డెప్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోల్లో ఒకడిగా నిలిచాడు. ప్రస్తుతం జానీ డెప్ వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి.

ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ అంబర్ హార్డ్ ని జానీ డెప్ 2015లో వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత వీరి వివాహ జీవితంలో విభేదాలు తలెత్తాయి. దీనితో ఈ జంట 2017లో విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. అంబర్ హార్డ్ తనని చిత్ర వధ చేసిందంటూ ఆమెపై జానీ డెప్ కేసు నమోదు చేశాడు. 

ప్రస్తుతం ఈ కేసు కోర్టులో కొనసాగుతోంది. అమెరికాలోని కోర్టులో జానీ, అంబర్ హార్డ్ మధ్య పరువు నష్టం కేసు కొనసాగుతోంది. విచారణలో భాగంగా ఇటీవల కోర్టులో ఓ వీడియో ప్లే చేశారు. ఇందులో స్పష్టంగా అంబర్ హార్డ్.. జానీ డెప్ పై దాడి చేస్తున్నట్లు ఉంది. 

కానీ గతంలో అంబర్ హార్డ్.. జానీ డెప్ తనపై దాడి చేసేవాడు అంటూ ఆరోపించింది. కానీ కోర్టులో ఆమె అసలు స్వరూపం బయట పడింది. దీనిపై ప్రముఖ నటుడు అలెన్ బాల్డ్విన్ కుమార్తె ఐర్లాండ్ బాల్డ్విన్ జానీ డెప్ కు మద్దతు తెలిపింది. అంబర్ హార్డ్ పై తీవ్రమైన విమర్శలతో విరుచుకుపోయింది. 

అంబర్ హార్డ్ ఎలాంటి మహిళో నాకు బాగా తెలుసు. ఆమె వ్యక్తిత్వం దారుణంగా ఉంటుంది. తాను బాధితురాలిని అని అసత్యం ప్రచారం చేసుకునేందుకు.. మహిళని అనే సానుభూతి ప్రయోగిస్తుంది. ఎంతటికైనా దిగజారే మహిళ ఆమె అంటూ ఐర్లాండ్ బాల్డ్విన్ విరుచుకుపడింది. 

జానీ డెప్ తన జీవితంలో కోల్పోయిన పేరు ప్రఖ్యాతలు, ప్రశాంతత, సంతోషం తిరిగి పొందాలని ఐర్లాండ్ బాల్డ్విన్ కోరింది.