Asianet News TeluguAsianet News Telugu

నువ్వు మాట్లాడడానికి లేదంటూ...  సమంతకు షాక్ ఇచ్చిన ప్రైమ్!


తమిళనాడు ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ మనో తంగరాజ్ ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ విడుదల ఆపివేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశారు. ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయితే అమెజాన్ ప్రైమ్ కి నష్టం చేకూర్చే అవకాశం కలదు. 

amazon prime guides samantha not to talk about family man 2 controversy ksr
Author
Hyderabad, First Published May 29, 2021, 4:28 PM IST

విడుదలకు ముందే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్. సమంత డెబ్యూ వెబ్ సిరీస్ గా తెరకెక్కిన ఫ్యామిలీ మాన్ 2 ప్రోమో చూసిన తమిళ వాసులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమంత పాత్ర తమ మనోభావాలు కించపరిచే విధంగా ఉందంటూ ఆరోపణలు చేస్తున్నారు. తమిళనాడు ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్ మినిస్టర్ మనో తంగరాజ్ ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ విడుదల ఆపివేయాలని కోరుతూ కేంద్ర మంత్రికి లేఖ కూడా రాశారు. 


ఈ గొడవ చిలికి చిలికి గాలివాన అయితే అమెజాన్ ప్రైమ్ కి నష్టం చేకూర్చే అవకాశం కలదు. దీనితో నష్టనివారణ చర్యలలో భాగంగా అమెజాన్ ప్రైమ్ యాజమాన్యం సమంతకు కొన్ని కీలక సూచనలు చేశారు. తమిళ ప్రజల వ్యతిరేకత, ఈ వివాదం గురించి ఏ విధమైన ఇంటర్వ్యూ, కార్యక్రమాలలో మాట్లాడవద్దని సమంతకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో సమంత కొంత అసహనంగా ఉన్నారు. ప్రోమో చూసి ఇలాంటి వ్యతిరేక అభిప్రాయానికి రావడం ఏమిటని పరోక్షంగా ప్రశ్నిస్తున్నారు. 


ఇక బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో ఈ సిరీస్ తెరకెక్కింది. సక్సెస్ ఫుల్ సిరీస్ కి సీక్వెల్ గా ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ తెరకెక్కింది. ప్రియమణి మనోజ్ భార్యగా ఓ రోల్ చేయడం జరిగింది. కాగా ఈ సిరీస్ లో సమంత నెగిటివ్ షేడ్స్ కలిగిన సూసైడ్ బాంబర్ గా కనిపించనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios