సూపర్ స్టార్ మహేష్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన తాజా చిత్రం మహర్షి భాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు బ్రద్దలు కొడుతున్న నేపధ్యంలో ఆయన నెక్ట్స్ ప్రాజెక్టులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అది ఏ స్దాయిలో అంటే ఇంకా లాంచ్ కాని ఆయన తదుపరి సినిమా డిజిటల్ రైట్స్ అదిరిపోయే రేటుకు అమ్ముడుపోవటమే. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డిజిటిల్ ప్లాట్ ఫామ్ లో లీడింగ్ గా ఉన్న అమెజాన్ ప్రైమ్ సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపూడిల కాంబినేషన్ లో రూపొందించబోయే చిత్రం డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. సాధారణంగా ఏ చిత్రం అయినా షూటింగ్ ప్రారంభం అయ్యాక బిజినెస్ ప్రారంభం అవుతుంది. కానీ ఎఫ్ 2 వంటి క్రేజీ హిట్ ఇవ్వటం, మహేష్ బాబు బ్రాండ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

ఇక అమెజాన్ కు ఇచ్చిన ఈ డీల్ లో ...బెల్లంకొండ సీత, గోపీచంద్ తో ఇంకా టైటిల్ పెట్టని చిత్రం, మహేష్ బాబు మొదలు కాని చిత్రం ఈ మూడు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర నిర్మించనున్నారు.వచ్చే  సంక్రాంతికి విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

జూలై నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇందులో మ‌హేష్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తాడని ప్రచారం జరుగుతోంది. రాయల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోయే చిత్ర‌మిది. అలాగే మ‌హేష్ పాత్ర కూడా ప‌క్కా రాయ‌ల‌స‌మీ స్లాంగ్‌లోనే మాట్లాడుతుంద‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్ స‌మ్మ‌ర్ వెకేష‌న్‌లో ఉన్నాడు. అక్క‌డి నుండి తిరిగి రాగానే ఈ సినిమా మొద‌ల‌వుతుంది.