మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన సినిమా 'అమర్ అక్బర్ అంటోనీ'. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాపై సోషల్ మీడియాలో భినాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. 

కొంతమంది సినిమా బావుందని శ్రీనువైట్ల ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం డిజాస్టర్ అని తేల్చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చలేదనే తెలుస్తోంది. శ్రీనువైట్ల పాత పంథాలోనే సినిమా రూపొందించాడని పెదవి విరిచేస్తున్నారు.

శ్రీనువైట్ల కామెడీకి అసలు నవ్వు రావడం లేదని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. 'కష్టం.. ఫస్ట్ హాఫ్ కే క్లైమాక్స్ తెలిస్తే ఎట్టుంటాదో తెలుసా..?' వైట్ల టేకింగ్ పై కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ పెర్ఫార్మన్స్, భారీ నిర్మాణ విలువలు సినిమాను కాపాడలేకపోయాయని టాక్. రోటీన్ స్క్రీన్ ప్లే, బోరింగ్ కామెడీ, అవసరం లేని పాటలతో ప్రేక్షకులు విసుగెత్తడం ఖాయమంటున్నారు. 

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ కి ట్విట్టర్ లో శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కావడంతో అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…