అమలాపాల్ ప్రస్తుతం బోల్డ్ చిత్రాలతో సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అమలాపాల్ 'ఆమె' చిత్రంలో నగ్నంగా నటించింది. దీనితో ఆమె సినిమాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ చిత్రం జులై 19న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అమలాపాల్ ప్రచార కార్యక్రమాలని షురూ చేసింది. 

ఓ ఇంటర్వ్యూలో తాను నటించిన బోల్డ్ సీన్స్ గురించి అమలాపాల్ ఆసక్తికర విషయాలు తెలిపింది. న్యూడ్ సీన్స్ లో తాను కాన్ఫిడెంట్ గా నటిస్తానో లేదో అని దర్శకుడు ఓ ప్రత్యేక వస్త్రం ధరించడం గురించి నాతో చర్చించాడు. అవసరం లేదు.. ధైర్యంగా నటిస్తానని డైరెక్టర్ రత్నకుమార్ కు తెలిపా. 

న్యూడ్ సీన్ షూటింగ్ రోజు చాలా టెన్షన్ కు గురయ్యా. సెట్స్ లో ఎలా ఉంటుంది.. ఎంతమంది ఉంటారు.. నాకు రక్షణ ఏంటి అనే ప్రశ్నకు నా మదిలో మెదిలాయి. 

అయితే దర్శకుడు చాలా పకడ్బందీగా సెట్స్ ని ఏర్పాటు చేశారు. న్యూడ్ సీన్స్ షూట్ చేసే సమయంలో సెట్స్ లో 15మంది సభ్యులు ఉన్నట్లు అమలాపాల్ తెలిపింది. చిత్ర యూనిట్ నాపై చాలా నమ్మకం ఉంచింది. లేకేపోతే అంత ధైర్యంగా నటించగలిగేదాన్ని కాదు అని అమలాపాల్ చెప్పుకొచ్చింది.