అందంతో,నటనతో,వివాదాలతో పాపులరైన నటి అమలాపాల్‌.  చర్చనీయాంశమైన పాత్రలో నటించి  వార్తల్లోకి ఎక్కింది. అన్ని దక్షిణాది చిత్ర పరిశ్రమలలో విభిన్న పాత్రలో నటించి తనకంటూ ఓ ప్యాన్ ఫాలోంగ్ ఏర్పారుచుకుంది. నటిగా కంటే వివాదాస్పద సంఘటనలతోనే ఎక్కువగా పేరు తెచ్చుకుంది. హీరొయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే  పెళ్లి చేసుకుని రెండేళ్లలోనే  విడాకులు తీసుకుంది.

నిత్యం వార్తలతో నిలుస్తూ  కథానాయకిగా నిలదొక్కుకుంటుంది. పెళ్ళి, న్యూడి పాత్రలో నటించడం, కారు వివాదం, ఒకతను అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌స్టేషన్‌ వరకరూ వెళ్లడం లాంటి సంఘటనలతో ఆమె ఓ న్యూస్ ఐటమ్‌గా మారిపోయింది.  దర్శకుడి విజయ్‌ని పెళ్ళి చెసుకుని రెండేళ్లలోనే ఆ బంధానికి తెగదింపులు చెసుకుంది.

 

 విదేశాలలో ఖరీదైన కారును కొనుగోలు చేసి రిజిస్టర్‌చార్జీలు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో పాండిచేరిలో  దాన్ని  రిజిస్టర్‌ చేయించి వివాదంలో చిక్కుకుంది.  ఆ తర్వాత "ఆడై " చిత్రంలో న్యూడి పాత్రలో నటించి భారతీయ సీని పరిశ్రమ ఆమె వైపు తిరిగి చూసుకోనేలా చేసుకుంది. ఈ మధ్య  ఓ వ్యక్తి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పోలీస్‌స్టేషన్‌ వరకరూ వెళ్లి కలకలం సృష్టించింది. 


కొద్దీ రోజులుగా వార్తల్లో లేని ఆమె తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో సామాజక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. వ్యాయమం సంబంధించిన వీడియోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసింది. తన ఫిట్‌నెస్‌కు కష్టపడుతున్న వీడియో అందర్ని ఆకట్టుకుంటుంది. తను నటించిన  అదో అందపరవై పోల చిత్రం షూటింగ్ పూర్తైంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. 

 ప్రస్తుతం ఒక మలయాళ చిత్రంతో పాటు వెబ్‌ సిరీస్‌లోనూ నటిస్తోంది.అలాగే బాలీవుడ్ ఎంట్రీకి కూడా రంగం సిద్దం చేసుకుంటుంది. అందుకు తీవ్ర కసరత్తులు కష్టపడుతుంది. నాజుకుగా కనిపించడం కోసం వరౌట్స్‌ చేస్తోందట. తన కష్టపడుతున్న వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి ఉచిత ప్రచారం పొందుతోంది.