మలయాళం బ్యూటీ అమల పాల్ చాలా రోజులుగా ఒక సినిమా ను సొంత డబ్బుతో నిర్మించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఫైనల్ గా బేబీ ఇప్పుడు డ్రీమ్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తెచ్చింది. సప్సెన్స్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను  అనూప్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. 

కేరళలో రీసెంట్ గా సినిమాను లాంచ్ చేశారు. అయితే ఈ సినిమా కాన్సెప్ట్ ఇంతకుముందు చాలా మంది ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్లింది కానీ ఎవరు పట్టించుకోలేదట. కానీ బేబీ మాత్రం సింగిల్ సిట్టింగ్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సొంతంగా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నట్లు ఒప్పందాన్ని కూడా  కుదుర్చుకుంది. 

ఆమె మేనేజర్ కూడా ఈ ప్రయోగాత్మక చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. సాధారణంగా హీరోయిన్స్ నిర్మాతగా మారాలంటే ఎంతో ఆలోచిస్తారు. మాక్సిమమ్ అటు వైపు వెళ్లరు. కానీ అమలా పాల్ దైర్యంగా అడుగులువేస్తోంది. మరి మేడమ్ గారు ఎంతవరకు హిట్టందుకుంటారో చూడాలి.