Asianet News TeluguAsianet News Telugu

భార్య స్నేహారెడ్డి బర్త్ డే అల్లు అర్జున్ ఎలా సెలబ్రేట్ చేశాడో తెలుసా?

సతీమణి బర్త్ డే నేపథ్యంలో ప్రఖ్యాత గోల్డెన్ టెంపుల్ ని సందర్శించారు బన్నీ. పిల్లలతో పాటు అమృత సర్ లోని స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. ఆయన విజిట్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

allu snehareddy birthday this is how allu arjun celebrated
Author
First Published Sep 29, 2022, 2:37 PM IST


సెప్టెంబర్ 29 స్నేహారెడ్డి బర్త్ డే. ప్రియమైన భార్య బర్త్ డే వేడుకలు అల్లు అర్జున్ నిరాడంబరంగా నిర్వహించాడు. అల్లు అర్హ, అయాన్ సమక్షంలో ఆమెతో కేక్ కట్ చేయించాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటో అల్లు అర్జున్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే క్యూటీ... అని కామెంట్ కూడా పెట్టాడు. అలాగే స్నేహారెడ్డి బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో పాటు అమృత్ సర్ వెళ్లారు. అక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం స్వర్ణ దేవాలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. 

అల్లు అర్జున్ స్వర్ణ దేవాలయం సందర్శనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2011 మార్చ్ లో వీరి వివాహం జరిగింది. 2014లో అబ్బాయి అయాన్, 2016లో అమ్మాయి అర్హ జన్మించారు. స్టార్ హీరో వైఫ్ అయిన స్నేహారెడ్డి ఆ గ్లామర్ మైంటైన్ చేస్తారు. హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని అందం కలిగిన స్నేహారెడ్డి అప్పుడప్పడూ ఫోటో షూట్స్ చేస్తారు. 

కాగా అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం మూవీతో వెండితెర ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మైథలాజికల్ మూవీలో సమంత హీరోయిన్. ఈచిత్రంలో అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ఇక త్వరలో అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో బిజీ కానున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాగా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. 2021 లో విడుదలైన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా పుష్ప 2 తెరకెక్కుతుంది. సుకుమార్ దర్శకుడు కాగా రష్మిక మందాన హీరోయిన్. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios