ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండడం చూస్తున్నాం. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా అల్లు స్నేహ గ్లామర్ గా కనిపిస్తూ ఆ ఫోటోలని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండడం చూస్తున్నాం. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లుగా అల్లు స్నేహ గ్లామర్ గా కనిపిస్తూ ఆ ఫోటోలని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. అలాగే అల్లు అర్జున్, ఇతర ఫ్యామిలీ విశేషాల్ని కూడా అల్లు స్నేహ షేర్ చేస్తూ ఉంటుంది.
గత కొంతకాలంగా కొణిదెల, అల్లు ఫ్యామిలీ మధ్య సఖ్యత అంత బాగా లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్యన అల్లు అరవింద్ కూడా అలాంటిది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ ఫ్యాన్స్ లో మాత్రం దీని గురించి చర్చ జరుగుతూనే ఉంది. రాంచరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ గా దూసుకుపోతున్నారు. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తో.. బన్నీ పుష్పతో పాన్ ఇండియా గుర్తింపు దక్కించుకున్నారు.
తాజాగా అల్లు స్నేహ సోషల్ మీడియాలో అదిరిపోయే పిక్ షేర్ చేసింది. నేడు రాంచరణ్, ఉపాసన దంపతుల 11వ వెడ్డింగ్ యానవర్సరీ. ఈ సందర్భంగా అల్లు స్నేహ బ్యూటిఫుల్ పిక్ షేర్ చేసింది.ఈ ఫోటో లో అల్లు అర్జున్, రాంచరణ్ సతీసమేతంగా కనిపిస్తున్నారు.

మెగా ఫాన్స్ ని ఈ ఫోటో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థానికి హాజరైనప్పుడు అల్లు అర్జున్, చరణ్ ఇలా తమ భార్యలతో ఫోటో దిగారు. కొణిదెల, అల్లు ఫ్యామిలీస్ మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న రూమర్స్ ని ఈ పిక్ పటాపంచలు చేసే విధంగా ఉందంటూ మెగా ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
చరణ్, ఉపాసన పెళ్లి రోజు సందర్భంగా వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో ఉపాసన, చరణ్ తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే.
