Asianet News TeluguAsianet News Telugu

అల్లు స్నేహారెడ్డి బర్త్ డే.. క్యూట్ వీడియోతో విష్ చేసిన అల్లు అర్జున్..

అల్లు అర్జున్ భార్య పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ స్టార్ క్యూట్ వీడియోను షేర్ చేశారు. ‘సన్ షైన్ ఆఫ్ మై లైఫ్’ అంటూ స్నేహారెడ్డికి బర్త్ డే విషెస్ తెలిపారు. 

Allu Sneha reddy Birthday Allu Arjun wished with a cute Video NSK
Author
First Published Sep 29, 2023, 3:16 PM IST | Last Updated Sep 29, 2023, 3:16 PM IST

అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహారెడ్డి (Sneha Reddy)  తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటుంది. తన ఫ్యామిలీ గురించి, అల్లు అర్జున్ సినిమా గురించి అప్డేట్ ఇస్తూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్లకే షాక్ ఇచ్చేలా ఫ్యాషన్ వేర్స్ లో దర్శనమిస్తూ నెట్టింట గట్టి ఫాలోయింగ్ నే పెంచుకున్నారు. 

అయితే, ఈరోజు అల్లు స్నేహా రెడ్డి పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన భార్యను విష్ చేశారు. క్యూట్ వీడియోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే క్యూటీ.. నా జీవితపు వెలుగు’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అలాగే బుల్లితెర సెలబ్రెటీలు, పీవీ సింధు కూడా స్నేహా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

ఇక అర్జున్ ఫ్యాన్స్ ‘హ్యాపీ బర్త్ డే వదినమ్మ..’ అంటూ బన్నీ షేర్ చేసిన ఫొటోను లైక్స్ తో వైరల్ చేస్తున్నారు. ఇక అల్లు స్నేహారెడ్డి అభిమానులు కూడా విష్ చేస్తున్నారు. అల్లు స్నేహారెడ్డి 1985 సెప్టెంబర్ 29న జన్మించారు. ఈ ఏడాదితో 33వ ఏటా అడుగుపెట్టారు. SIT ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్, బిజినెస్ మెన్ సీ శేఖర్ రెడ్డి కూతురే స్నేహా రెడ్డి. 

కామన్ ఫ్రెండ్ పెళ్లిలో తొలిసారిగా పరిచయం అయిన బన్నీ, స్నేహా కొన్నాళ్లు ప్రేమలో మునిగి తేలారు. 2011 మార్చి 6న వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరిగింది. వీరికి కొడుకు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హా ఉన్న విషయం తెలిసిందే. ఇక బన్నీ ప్రస్తుతం Pushpa 2 The Rule  చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి డైరెక్షన్ లో నటించనున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios