12th Fail: మూవీ చూస్తూ ఏడ్చేశా, మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి..అల్లు శిరీష్ ప్రశంసలు
గత ఏడాది విడుదలైన 12th ఫెయిల్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవితం ఆధారంగా బయోపిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
గత ఏడాది విడుదలైన 12th ఫెయిల్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవితం ఆధారంగా బయోపిక్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు ఓటిటి లో సైతం దూసుకుపోతోంది. గొప్ప బయోపిక్ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.
మనోజ్ కుమార్ పాత్రలో విక్రాంత్ మాస్సే అద్భుతంగా నటించారు. డైరెక్టర్ విధు వినోద్ చోప్రా రియలిస్టిక్ టేకింగ్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. మనోజ్ కుమార్ ఐపిఎస్ అధికారి కావడానికి ఎంతలా కష్టపడ్డాడు అనేది చూపిస్తూనే.. ఇండియాలో విద్యావ్యవస్థలో ఉన్న లోపాలని కూడా ఎత్తిచూపారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, క్రిటిక్స్ మాత్రమే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.
తాజాగా అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ఈ చిత్రం గురించి పోస్ట్ చేశారు. 12th ఫెయిల్ చిత్రం చూస్తున్నప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగాయి అని శిరీష్ తెలిపాడు. కాస్త ఆలస్యమైనా ఈ చిత్రాన్ని చూశాను. ప్రధాన నటులు విక్రాంత్, మేధా శంకర్ తో పాటు ఇతర నటులు కూడా వారి పాత్రల్లో జీవించారు.
మాస్టర్ స్టోరీ టెల్లర్ వినోద్ చోప్రా ఈ కథని ఎంచుకున్నందుకు థ్యాంక్స్ చెబుతున్నా. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు మా నాన్న ఒక విషయం చెప్పారు. ఈ చిత్రం చూస్తున్నపుడు నాకు అది గుర్తుకు వచ్చింది. మనల్ని పాలించేది రాజకీయ నాయకులే అయినప్పటికీ ఈ దేశం నడిచేది మాత్రం అధికారుల వల్లే అని చెప్పారు. అలాంటి అధికారి జీవిత కథ సిల్వర్ స్క్రీన్ పై సినిమాగా రావడం గొప్ప విషయం అని అల్లు శిరీష్ తెలిపారు. మీరు కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని చూడండి అని శిరీష్ కోరాడు.