స్టార్ దర్శకులతో వర్క్ చేయాలనే ఆలోచన అందరికి ఉంటుంది. చిన్న తరహా సినిమాలు చేసుకుంటూ ఎదో ఒకరోజు బడా దర్శకుడితో వర్క్ చేసే అవకాశం రాకపోదా అని ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం అల్లు శిరీష్ మైండ్ లో కూడా అదే ఆలోచన ఉంది. గీత ఆర్ట్స్ లాంటి బిగ్గెస్ట్ హోమ్ బ్యానర్ ఉన్నప్పటికీ సొంతంగా ఎదిగేందుకు శిరీష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

కానీ మనోడికి సరైన హిట్ దక్కడం లేదు. రీసెంట్ గా వచ్చిన ఎబిసిడి సినిమా కూడా ప్లాప్ కావడంతో నెక్స్ట్ సినిమాపై కేర్ తీసుకుంటున్నాడు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ డైరెక్టర్స్ పై శిరీష్ తన వివరణను ఇచ్చాడు. స్టార్ దర్శకులతో వర్క్ చేయాలనీ ఉంటుంది. కానీ ఇంతవరకు పెద్ద దర్శకులెవరు నన్ను కలవలేదు. 

ఎందుకంటే వాళ్ళకి ముందే స్టార్ హీరోస్ రెడీగా ఉన్నారు. కోట్ల రూపాయల వర్క్ ని వదిలేసుకొని నా లాంటి హీరోల దగ్గరికి ఎందుకు వస్తారు. అందుకే వీలైనంతవరకు నా దగ్గరకు వస్తున్న స్క్రిప్ట్ లపై ఇంట్రెస్ట్ చూపిస్తున్ననని శిరీష్ తెలిపాడు.నెక్స్ట్ కూడా ఈ హీరో మరో లవ్ స్టోరీతో రాబోతున్నట్లు టాక్.