Asianet News TeluguAsianet News Telugu

బిగ్‌ స్టార్స్ సినిమాలు కూడా ఓటీటీలో.. అల్లు అరవింద్‌

ఆగస్ట్ నెలను పండగ నెలగా ఆహా ప్రకటించింద అల్లు అరవింద్‌ అన్నారు. రేపు స్వాతంత్ర్య దినోత్సవం కావడం, వినాయక చవితి ఉండటం, చిరంజీవి బర్త్ కావడంతో వీటన్నింటిని
కలిపి  పండగ నెలగా ఆగస్ట్ ని భావిస్తున్నట్టు అల్లు అరవింద్‌ తెలిపారు. 

allu arvind said that in the coming days big hero movies will also be released   in ott
Author
Hyderabad, First Published Aug 14, 2020, 9:18 AM IST

కరోనా వైరస్‌ కారణంగా మూత పడ్డ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో డిజిటల్‌ మాధ్యమాలపై ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లకు డిమాండ్‌ పెరిగింది. ఓ మోస్తారు బడ్జెట్‌ సినిమాల నుంచి చిన్న చిత్రాలు వరకు ఓటీటీలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ప్రధానంగా వినిపిస్తున్న ఓటీటీ `ఆహా. టాలీవుడ్‌ బడా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ కొంత మంది పార్టనర్లతో కలిసి ఈ డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ని స్థాపించారు. 

దీని కోసం వెబ్‌ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. మరోవైపు థియేటర్లు మూత పడటంతో సినిమాలను కూడా విడుదల చేస్తున్నారు. అడల్ట్ కంటెంట్‌కి దూరంగా.. భిన్నమైన కంటెంట్‌తో కూడిన చిత్రాలను విడుదల చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటోంది `ఆహా`. ఇప్పటికే ఇందులో `సిన్‌`, `లాక్డ్`, `మస్తీన్‌`, `గీతా సుబ్రమణ్యం` వంటి వెబ్‌ సిరీస్‌లను రూపొందించి విడుదల చేశారు. ఇటీవల `భానుమతి అండ్‌ రామకృష్ణ`, `కృష్ణ అండ్‌ హిజ్‌ లీల` చిత్రాలను విడుదల చేసింది. ఈ రెండింటికి మంచి స్పందన లభించింది. 

 ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలను పండగ నెలగా ఆహా ప్రకటించింది. రేపు స్వాతంత్ర్య దినోత్సవం కావడం, వినాయక చవితి ఉండటం, చిరంజీవి బర్త్ కావడంతో వీటన్నింటిని కలిపి పండగ నెలగా ఆగస్ట్ ని భావిస్తున్నట్టు అల్లు అరవింద్‌ తెలిపారు. అంతేకాదు ఈ సందర్బంగా `ఆహా`లో `జోహార్‌`, `మెట్రోకథలు`, `బుచ్చినాయుడు కండ్రిగ తూర్పువీధి` సినిమాలతోపాటు `ఆల్‌ ఈజ్‌ వెల్‌`షోను ప్రసారం చేయబోతున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం థియేటర్ల విషయంలో చాలా ఇబ్బందికర పరిస్థితులున్నాయని, మరో రెండు మూడు నెలలు థియేటర్లు ఓపెన్‌ అయ్యేలా లేవని తెలిపారు. తాను ప్రతి రోజు అనేక కథలు వింటున్నానని, తాను విన్న కథలన్నింటిని తెరపైకి తీసుకురాలేమని, బాగున్న కొన్ని కథలను `ఆహా` కోసం రూపొందించాలనుకుంటున్నామని తెలిపారు. 

అయితే ఎప్పటికైనా సినిమా అనుభూతిని మించింది లేదని, ఇప్పుడు థియేటర్లు ఓపెన్‌ అయినా భారీగా జనం థియేటర్‌కి రారు. వ్యాక్సిన్‌ వస్తేనే క్రమంగా ఆడియెన్స్ పెరుగుతారు. అప్పటి వరకు ఓటీటీలకు మంచి డిమాంట్‌ ఉంటుంది. `ఆహా`లో పలు సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను విడుదల చేస్తున్నాం. వచ్చే వారం ఎక్కువ సినిమాలు విడుదల చేస్తున్నాం. అవి చూస్తే ఎవరైనా ఆహా అనాల్సిందే. ఇక దసరా నెలను కూడా ఫెస్టివల్‌ నెలగా ప్రకటించనున్నాం. థియేటర్లు మూత పడటంతో ఆహాకి డిమాండ్‌ బాగా పెరిగిందన్నారు. బలమైన కంటెంటే మా సక్సెస్‌ అని, ఈ ఏడాదిన్న కాలంలో మేం రీచ్‌ కావాలనుకున్న టార్గెట్‌ని రీచ్‌ అయ్యామన్నారు. 

ఆరు నెలల్లో `ఆహా` యాప్‌ని దాదాపు నాలభై లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఆహా కంటెంట్‌ కోసం కోటి ఇరవై లక్షల మంది సెర్చ్ చేశారు. వచ్చే ఏడాది ఇదే టైమ్‌కి రెండు, మూడు రెట్లు ప్రేక్షకులు ఆహా యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటారని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఏటీటీలను కూడా ఆడియెన్స్ ఆదరిస్తున్నారని తెలిపారు. ఇక తమ `ఆహా`లో వచ్చే ఏడాదిలో దాదాపు 42 షోస్‌ని ప్లాన్‌ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం కరోనా విజృంభన వల్ల షూటింగ్‌లు ప్రారంభం కావడం కష్టంగా ఉంది. వచ్చే నెలలో షూటింగ్‌లు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. మరో రెండు మూడేళ్ళలో పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీలోకి వస్తాయని తెలిపారు. ఈ ఏడాది సినిమాలు రిలీజ్‌లు చాలా తక్కువే అని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios