స్టయిలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని విలన్‌ పాత్రదారిని పరిచయం చేశారు. తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమాకి సంబంధించిన ఓ ముందుమాటని చెప్పబోతున్నట్టు వెల్లడించారు. జనరల్‌గా ఇటీవల సినిమాల ప్రమోషన్‌ ట్రెండ్‌ మారింది. ఎప్పుడో విడుదలకు ముందు కాకుండా షూటింగ్‌ దశ నుంచే ఒక్కో అప్‌డేట్‌ ఇస్తూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. ఆద్యంతం సినిమాపై క్రేజ్‌ని పెంచుతూ, అందరి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 

అందులో భాగంగా అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న `పుష్ప` చిత్రం కూడా అదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌ మరింత కొత్తగా చేయబోతున్నట్టు తెలుస్తుంది. `పుష్పరాజ్‌ ముందుమాట`ని చెప్పబోతున్నట్టు యూనిట్‌ పేర్కొంది. రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు ఈ పరిచయ భాగాన్ని విడుదల చేయబోతున్నారు. సినిమాకి సంబంధించి ప్రమోషన్‌ విషయంలో ఇదే ఫస్ట్ గ్లింప్స్  గా ఉండబోతుంది. మరి రేపు పుష్పరాజ్‌ ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇస్తారో చూడాలి. కానీ ఈ అప్‌డేట్‌ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా మాలీవుడ్‌ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎర్ర చందన స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో పుష్పరాజ్‌ అనే డీగ్లామర్‌, మాస్‌ రోల్‌లో బన్నీ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. ఇక ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా తరహాలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు.