‘జవాన్‌’  చిత్రం రిలీజ్ కోసం అభిమానులతో పాటు అల్లు అర్జున్ కూడా ఎదురుచూస్తున్నారు. అదేంటి అల్లు అర్జున్ కు ఈ చిత్రం రిలీజ్, రిజల్ట్ తో సంభంధం ఏమిటి అంటారా...


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జవాన్ (Jawan) పై ఎంత హైప్ ఉందో తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార (Nayanthara), దీపికా పాడుకొనే(Deepika padukone) హీరోయిన్స్ గా నటించారు.హై ఎక్సపెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులతో పాటు అల్లు అర్జున్ కూడా ఎదురుచూస్తున్నారు. అదేంటి అల్లు అర్జున్ కు ఈ చిత్రం రిలీజ్, రిజల్ట్ తో సంభంధం ఏమిటి అంటారా...

అట్లీ కు తెలుగు హీరోతో చేయాలని చాలా కాలం నుంచి ఉంది. తెలుగు హీరోలు సైతం ఉత్సాహం చూపిస్తున్నారు. తమిళంలో వరసపెట్టి విజయ్ తో మూడు హిట్ సినిమాలు చేయటంతో అతనికు తెలుగు మార్కెట్ లో క్రేజ్ అక్కడా ఉంది. అప్పట్లో ఎన్టీఆర్ తో ట్రై చేసాడు. కొంత దూరం ముందుకు వెళ్లి ఆగింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో అనుకుని ఓ స్క్రిప్ట్ రెడీ చేసారు. జవాన్ తర్వాత అల్లు అర్జున్ తో కానీ విజయ్ తో కానీ వారి డేట్స్ ఇచ్చే దాన్ని బట్టి చేస్తారు అట్లీ. అయితే అల్లు అర్జున్ సైతం జవాన్ ..ఏ స్దాయి హిట్ అవుతుందనే దానిని దృష్టిలో ఉంచుకుని అట్లీకి డేట్స్ ఇచ్చే అవకాసం పరిశీలిస్తారని వినిపిస్తోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం తన భారీ ప్రాజెక్ట్ "పుష్ప 2" షూటింగ్ లో ఉన్నాడు. వచ్చే ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా కూడా ప్రారంభించనున్నాడు. కాబట్టి, "జవాన్" విడుదల తర్వాత అతను అట్లీతో ప్రాజెక్టు సైన్ చేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది. 

మరో ప్రక్క జవాన్‌ అడ్వాన్స్ టిక్కెట్‌ బుకింగ్స్‌ (Advance Ticket Bookings) కూడా ఓపెన్ అయ్యాయి. పఠాన్‌ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో ‘జవాన్‌’ పై క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. ఈ నేపథ్యంలో జవాన్‌ అడ్వాన్స్‌ టికెట్స్‌ బుకింగ్స్‌ ఓపెన్ అవ్వగానే హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి టికెట్స్‌. రూ.1,600 నుంచి రూ.2,400 వరకు టిక్కెట్ రేట్లు ఉన్నా జనం వెకకాడటం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లో జవాన్‌ టికెట్‌ ధర భారీగా ఉంది. మరీ ముఖ్యంగా ముంబై, ఢిల్లీ నగరాల్లో ఒక్కో టికెట్‌ ధర రూ.2,300 నుండి రూ.2.400 వరుకు ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది.