"నా పేరు సూర్య" నా ఇల్లు ఇండియా మేకర్స్ ఫిక్స్ అయిపోయారంతే...

First Published 25, Jan 2018, 9:41 AM IST
allu arjun vakkkantham vamsi na peru surya na illu india release date
Highlights
  • అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నాపేరు సూర్య
  • ఈ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్న మేకర్స్
  • రజినీ, మహేష్ ఎవరొచ్చినా తగ్గేదిలేదంటున్న నా పేరు సూర్య మేకర్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమా కథలో బలం ఉంటె దానికి తగ్గట్టుగా తన నటనతో మరింత బలాన్ని ఇస్తాడు. డ్యాన్స్, ఫైట్స్, సెంటిమెంట్, యాక్షన్ ఇలా ఏ సీన్ లో అయినా... తనదైన శైలిలో నటిస్తూ సినిమా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. ప్రస్తుతం అదే తరహాలో నా పేరు సూర్య సినిమా కోసం కూడా బన్నీ కష్టపడుతున్నాడు. ఎన్ని సినిమాలు బన్నీకి పోటీ వచ్చినా తప్పకుండా విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది.

 

రీసెంట్ గా ఫస్ట్ ఇంపాక్ట్ తో అంచనాలను అందుకోగలదు అని సిగ్నల్ కూడా ఇచ్చారు. అయితే సినిమా రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తుండడంతో గందరగోళం ఏర్పడింది. అసలైతే మొదట భరత్ అనే నేను సినిమాతో పాటే బన్నీ సినిమా కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ కావాలి. కానీ రజినీకాంత్ 2.0 కూడా అదే సమయంలో సిగ్నల్ ఇవ్వడం కొంచెం కలవరపెట్టింది. దీంతో సినిమా రిలీజ్ డేట్ లో తేడా రావచ్చు అనుకున్నారు. సూర్యా ముందే రావచ్చు అనే టాక్ కూడా వచ్చింది. కానీ ఫైనల్ గా వీళ్లు ఏప్రియల్ 27నే రావాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది.మీడియా  సమావేశంలో రిలీజ్ డేట్ గురించి ప్రస్తావనే లేదు. కాని ట్రేడ్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ప్రకారం.. ఏ సినిమా వచ్చినా బన్నీ మూవీ రిలీజ్ డేట్ లో తేడా రాదని చెప్పారట. ఇటు రజనీ అటు మహేష్ వచ్చినా కూడా 27నే ఈ సూర్యను జనాల్లోకి దించుతాం అని క్లారిటీ ఇచ్చేశారట. ఏదేమైనా కూడా అల్లు అర్జున్ డెసిషన్ తో సమ్మర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో చాలా తేడాలు రావచ్చని అనిపిస్తోంది.

loader