స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా అల.. వైకుంఠపురములో. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ పెరిగినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా హైదరాబద్ పరిసర ప్రాంతాల్లో ఒక షెడ్యూల్ ని ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోకి షిఫ్ట్ అయ్యింది. 

ఈ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రియాలిటీగా ఉండేందుకు ఒమునుపెన్నడు చూడని విధంగా సెట్ ని నిర్మించినట్లు సమాచారం. 5కోట్లతో కాస్ట్లీగా ఆ సెట్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాల్లోసెట్స్ ని చాలా తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసుకుంటాడు. 

కానీ ఇప్పుడు బన్నీ సినిమా కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయించక తప్పడం లేదట. సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే చాలా సన్నివేశాలు ఇక్కడే రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ - హారికా హాసిని క్రియేషన్స్ పై అల్లు అరవింద్ - చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.