అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ది హ్యాట్రిక్‌ కాంబినేషన్‌. ఈ కాంబోలో మరో సినిమా రావాల్సి ఉంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ని కన్ఫమ్‌ చేసింది యూనిట్‌.  

అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. బ్లాక్‌ బస్టర్స్ అయ్యాయి. హ్యాట్రిక్‌ హిట్స్ తో సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌గా నిలిచింది. మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమాని ప్రకటించారు. గతంలో ఈ కాంబోలో సినిమాని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ మూవీ ఉంటుందా లేదా అనేది డౌట్‌గా మారింది. మహేష్‌ బాబు హీరోగా త్రివిక్రమ్‌ రూపొందించిన `గుంటూరు కారం` సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో బన్నీ సినిమా డౌటే అనే వార్తలు వచ్చాయి. 

ఇప్పటి వరకు అదే డౌట్‌ అందరిలోనూ ఉంది. తాజాగా ఆ డౌట్స్ ని క్లీయర్‌ చేసింది టీమ్‌. బన్నీ, త్రివిక్రమ్‌ కాంబోలో సినిమా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ అల్లు అర్జున్‌కి బర్త్‌ డే విషెస్‌ తెలియజేసింది. నేడు అల్లు అర్జున్‌ పుట్టిన రోజు అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మాటల మాంత్రికుడి ఫ్యాన్స్ కి, అటు బన్నీ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌ చెప్పాయి నిర్మాణ సంస్థలు. ఈ చిత్రాన్ని హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 

ఈ కాంబినేషన్‌లోనే చివరగా `అల వైకుంఠపురములో` చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఇది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రెండు వందల కోట్లకుపైగా గ్రాస్ సాధించి షాకిచ్చింది. దీంతో మళ్ళీ ఈ కాంబోలో సినిమా అంటే అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.మరి ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందనేది తెలియాల్సి ఉంది. బన్నీ నెక్ట్స్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. అదే నెక్ట్స్ స్టార్ట్ అవుతుందంటున్నారు. మరి అది ముందు స్టార్ట్ అయితే త్రివిక్రమ్‌ సినిమాకి ఇంకా టైమ్‌ పడుతుందని, ఇది నెక్ట్స్ ఇయర్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి. 

Scroll to load tweet…

ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప2`లో నటించారు. ఆయన బర్త్ డే సందర్భంగా ఈ ఉదయం `పుష్ప2` టీజర్‌ని విడుదల చేశారు. జాతరలో అమ్మోరు లుక్‌లో బన్నీ ఆకట్టుకుంటున్నారు. కేవలం సీన్లు మాత్రమే ఉన్నాయి, జాతర హంగామా ఉంది. ప్రత్యర్థులను పుష్పరాజ్‌ చితక్కొట్టడమే కనిపించింది. డైలాగ్‌లు లేకపోవడం కాస్త డిజప్పాయింట్‌ చేస్తుంది.