కమర్షియల్ చట్రం నుంచి మెల్లిమెల్లిగా బయిటపడటానికి అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకు బెస్ట్ ఉదాహరణ...సుకుమార్ తో చేస్తున్న `పుష్ష‌` సినిమానే.  లాక్‌డౌన్ కి ముందు కొంత మేర షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా బ్రేక్ వచ్చింది. అయితే అన్ని జాగ్రత్తలతో త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ మొద‌ల‌వుతుంది. అయితే ఈ బ్రేక్ ని,గ్యాప్ ని అల్లు అర్జున్ సద్వినియోగం చేసుకున్నారు. ఆయన టాలీవుడ్ స్టార్ డైరక్టర్ కొర‌టాల శివ‌తో డిస్కషన్స్ చేసారు . `పుష్ప‌` త‌ర‌వాత‌.. కొర‌టాల‌తో ఓ సినిమా చేయ‌టానికి ఆయన ఫిక్స్ అయ్యారని సమాచారం.ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో కొర‌టాల కూడా..సమయం వృధా చేయకుండా... అల్లు అర్జున్ కోసం ఓ స్టోరీ సిద్థం చేస్తున్నాడు.

మీడియా సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం...ఈ సినిమాలో.. అల్లు అర్జున్ స్టూడెంట్ లీడ‌ర్ గా న‌టించ‌బోతున్నాడ‌ని టాక్‌. కాలేజీ రాజకీయాలు చుట్టు తిరుగుతుదంటున్నారు. అయితే ఇప్పుడు కార్పోరేట్ ప్రపంచంలో కాలేజీ రాజకీయాలు తగ్గిపోయి..నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాయి. కాలేజీలో ఎగ్జామ్ పేపరు లీక్ వంటి వాటితో స్టూడెంట్ జీవితాలతో ఆడుకునే వారి పని పట్టబోతున్నారట. కొర‌టాల శివ సినిమాల‌న్నీ సోషల్ మెసేడ్ నేప‌థ్యంలో సాగుతుంటాయి. ఆ సినిమా కూడా అలాంటిదే అంటున్నారు. 

మరో ప్ర్కక చిరంజీవి తో చేస్తున్న ఆచార్య కూడా అలాంటి క‌థే. ఇందులో.. చిరు న‌క్స‌లైట్ నాయ‌కుడిగా న‌టిస్తుంటే,రామ్ చరణ్ - స్టూడెంట్ లీడ‌ర్ అవుతున్నాడ‌న్న‌మాట‌. ఇక త్వ‌రలోనే కొర‌టాల‌తో బ‌న్నీ మ‌రో మీటింగ్ ఉంద‌ట‌. ఈసారి.. బ‌న్నీకి కొర‌టాల పూర్తి క‌థ చెప్ప‌బోతున్నాడ‌ని  అంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాని నిర్మించే అవకాసం ఉంది.