షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కిస్తున్నారు.

కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన పఠాన్ చిత్రం ఘనవిజయం సాధించింది. కొంతకాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో షారుఖ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. పఠాన్ ఆ ఆకలి తీర్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 500 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. ఇంత పెద్ద విజయం దక్కింది కాబట్టి షారుఖ్ తదుపరి చిత్రంపై అంచనాలు పెరుగుతాయి. 

షారుఖ్ ఖాన్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్నాడు. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కిస్తున్నారు. పఠాన్ తర్వాత జవాన్ గురించి చర్చ జోరుగా సాగుతోంది. కథ గురించి, పాత్రల గురించి అనేక ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. 

లేటెస్ట్ రూమర్ ఏంటంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జవాన్ చిత్రంలో క్యామియో రోల్ పోషించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 10 నిమిషాల పాత్ర కోసం అట్లీ ఇటీవల అల్లు అర్జున్ ని అప్రోచ్ అయ్యాడట. తన పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పడంతో బన్నీ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. 

ఈ క్రమంలో జవాన్ స్టోరీ గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో షారుఖ్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన విలన్ గా నటిస్తున్నాడు. స్టోరీ గురించి అందుతున్న లీకుల ప్రకారం.. షారుఖ్ డ్యూయెల్ రోల్ లో ఒక పాత్రకి అపోజిట్ గా విలన్ గా బన్నీ రోల్ ఉంటుందనే రూమర్ కూడా ఉంది. విలన్ కాదు పవర్ ఫుల్ రోల్ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

ఈ పాత్రలకి పైన తలపతి విజయ్ పాత్ర కూడా ఉంటుందని.. ఆయన కూడా క్యామియో రోల్ లో కనిపిస్తారని అంటున్నారు. ఇదంతా చూస్తుంటే అట్లీ జవాన్ చిత్రానికి సీక్వెల్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనే సందేహం వస్తుంది. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. జవాన్ లో బన్నీ క్యామియో నిజమైతే పుష్ప 2 చిత్రానికి నార్త్ లో ఎక్ట్రా మైలేజి లభించినట్లే. 

పుష్ప 2 వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. జూన్ లో జవాన్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోసారి నార్త్ లో పుష్ప గురించి చర్చ జరిగితే.. అది పుష్ప 2కి కలసి వస్తుంది. ఏది ఏమైనా జవాన్ లో అల్లు అర్జున్ పాత్ర గురించి జరుగుతున్న ప్రచారం మొత్తం ఊహాగానాలు మాత్రమే. అట్లీ ఎలాంటి ప్లాన్స్ తో ఉన్నాడో వేచి చూడాలి.