Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్...ఆర్గానిక్ ఫార్మింగ్, నిజమెంత?

ఇప్ప‌టికే తెలుగు చిత్ర సీమ నుంచి సురేశ్‌బాబు, ఎన్టీఆర్‌, స‌మంత వంటి స్టార్స్  ఆర్గానిక్ వ్య‌వ‌సాయంపై ఆస‌క్తి పెంచుకుని, సిటీకి దూరంగా కాయ‌గూర‌లు, చిన్న పంట‌ల‌ను పండిస్తున్నారు.

Allu Arjun takes up Organic Farming
Author
Hyderabad, First Published Oct 10, 2021, 9:24 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆర్గానిక్  ఫార్మింగ్  చేయ‌బోతున్న‌ట్లు ప్రచారం జరుగుతోంది. అందు కోసమే ఆయ‌న హైద‌రాబాద్ శివారు ప్రాంత‌మైన శంక‌ర ప‌ల్లిలో రెండు ఎక‌రాల భూమిని కోనుగోలు చేశార‌ని అంటున్నారు. ఆ భూమిలో ఆర్గానిక్ ప‌ద్ధ‌తుల్లో వ్య‌వసాయం చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నార‌ని, ఇప్పటికే భూమికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ ప‌నులు కూడా పూర్త‌య్యాయని చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకర్ పల్లి లో రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే  ఈ రెండు ఎకరాల భూమిలో అల్లు అర్జున్ ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయబోతున్నారని సమాచారం అందుతోంది. ఈ మాట నిజమే అంటున్నారు.

 సినీ రొటీన్ లైఫ్ నుంచి కొత్తదనం కోరుతూ ఇప్పటికే పవన్ కళ్యాణ్, సురేశ్‌బాబు, స‌మంత లాంటి వారు ఆర్గానిక్ వ్య‌వ‌సాయంపై ఆస‌క్తి పెంచుకుని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ అదే బాటలో వెళ్లనున్నారనేది మీడియా మాట. అలాగే అల్లు అర్జున్ కు ఆర్గానిక్ వ్య‌వ‌సాయం మీద ఆసక్తి పెరగడానికి ‘పుష్ప’ సినిమాయే కార‌ణమ‌ట‌. ఆయన గత కొంతకాలంగా "పుష్ప" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఎక్కువ శాతం అడవిలోనే ప్రకృతికి దగ్గరగా గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి ప్రకృతి, వ్యవసాయం పైన బాగా ఇష్టం పెరిగిందట. దీంతో బన్నీ స్వయంగా సేద్యం చేయడానికి నిర్ణయించుకున్నారు. త్వరలోనే అల్లు అర్జున్ ఆర్గానిక్ వ్యవసాయం చేసి రిలాక్స్ కాబోతున్నారు. త్వరలోనే పనులు మొదలెడతారట.

Also read నేడే మా ఎన్నికలు... గెలుపెవరిది?

పుష్ప విశేషాలకు వస్తే...అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప.. అల్లు అర్జున్ కెరీర్ మొత్తం మీద మొట్టమొదటసారిగా డి గ్లామర్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ముందు ఒక భాగంగానే రిలీజ్ చేయాలని అనుకున్నా సినిమా నిడివి పెరిగిపోవడంతో రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. మొదటి భాగం డిసెంబర్ 17వ తేదిన విడుదల చేస్తున్నామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ డేట్ లు క్లాష్ అయ్యే అవకాశం ఉండడంతో పుష్ప సినిమా డిసెంబర్ 17 నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ లో కనిపించిన సుకుమార్ పుష్ప సినిమా వాయిదా వేయడం లేదని వెల్లడించారు. చెప్పిన ప్రకారమే డిసెంబర్ 17వ తేదీన పుష్ప మొదటి భాగం విడుదల కాబోతోందని ఆయన పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios