Asianet News TeluguAsianet News Telugu

హీరో నవదీప్ కు ఐకాస్టార్ అల్లు అర్జున్ సర్ ప్రైజింగ్ గిఫ్ట్,.. ఏం పంపించారు...? ఎందుకు..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి స్నేహం బంధం ఉంది. అందులో కొందరు మాత్రం స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. అటువంటి వారిలో అల్లు అర్జున్. నవదీప్ కూడా ఉన్నారు. రీసెంట్ గా నవదీప్ కోసం కాస్ట్లీ గిఫ్ట్ పంపించాడు బన్నీ. 

Allu Arjun Special Gift For Navdeep
Author
Hyderabad, First Published May 13, 2022, 9:54 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి స్నేహం బంధం ఉంది. అందులో కొందరు మాత్రం స్టార్ ఇమేజ్ తో సంబంధం లేకుండా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. అటువంటి వారిలో అల్లు అర్జున్. నవదీప్ కూడా ఉన్నారు. రీసెంట్ గా నవదీప్ కోసం కాస్ట్లీ గిఫ్ట్ పంపించాడు బన్నీ. 

ఇండస్ట్రీలో స్టార్ డమ్ తో సంబంధం లేకుండా ఫ్రెండ్ షిప్ చేసేవారు చాలా మంది ఉన్నారు. అందులో ఐాకాన్ స్టార్ అల్లు అర్జున్, నవదీప్ కూడా ఉన్నారు.  జై సినిమాతో హీరో్గా ఎంట్రీ ఇచ్చి.. చంద‌మామ‌, ఆర్య 2 సెకండ్ మెయిన్ లీడ్స్ లో న‌టించి..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో నవదీప్ కు ఉన్న బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. 

ఈ యంగ్ స్టార్ కు ఆ స్టార్ హీరో ఖ‌రీదైన కానుక అందించాడు. ఆ ప్ర‌త్యేక కానుక‌ను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేస్తూ..త‌న సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు నవదీప్. అల్లు అర్జున్ . న‌వ‌దీప్‌కు చాలా ఖరీడైన  ఎయిర్‌పొడ్స్ కానుక‌గా పంపించాడు బ‌న్నీ. వారి స్నేహ బంధాన్ని మరోసారి చాటుకున్నారు అల్లు అర్జున్. 

సుకుమార్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఆర్య 2 సినిమాలో అల్లు అర్జున్‌-న‌వ‌దీప్ క్లోజ్ ఫ్రెండ్స్ గా న‌టించారు. ఈ క్రేజీ సినిమాలో బ‌న్నీ-న‌వ‌దీప్ మ‌ధ్య సన్నివేశాలు వారి స్నేహానికి చాలా దగ్గరగా ఉంటాయి.  ఆర్య 2తో న‌వ‌దీప్‌-అల్లు అర్జున్ మధ్య స్నేహ‌బంధం మ‌రింత పెరిగింది.  అల్లు అర్జున్ తనకు ప్రేమతో పంపిన ఆ గిప్ట్ ను సోషల్ మీడియాలో శేర్ చేశాడు నవదీప్. 

అంతే కాదు బన్నీని ఉద్దేశించి చిన్న నోట్ కూడా రాశాడు. ప్రేమకు హ‌ద్దులు లేకుంటే..ఒకేష‌న్ ఏమీ లేకున్నా సంద‌ర్భానుసారంగా కాకుండా బ‌హుమ‌తులు వ‌స్తే. ధ‌న్య‌వాదాలు అర్జున్ బావ్స్.ఈ స‌మాజం ఒప్పుకోక‌పోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడ‌తా అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు న‌వ‌దీప్‌.

న‌వ‌దీప్ నెక్ట్స్ అవ‌నీంద్ర డైరెక్ట్ చేస్తున్న ల‌వ్ మౌలీ సినిమాలో న‌టిస్తున్నాడు. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది ఈ మూవీ. అటు అల్లు అర్జున్ కూడా పుష్ప సక్సెస్ తో దిల్ ఖుష్ గా ఉన్నాడు. పుష్ప2 కోసం లైన్ సెట్ చేసే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్.  

Follow Us:
Download App:
  • android
  • ios