Allu Arjun Serious Meeting: పుష్ప టీమ్ తో అల్లు అర్జున్ సీరియస్ మీటింగ్... ఏం తేల్చారంటే...?

పుష్ప (Pushpa) పాన్ ఇండియా లెవల్లో హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్(Allu Arjun) తగ్గేదే లే అంటున్నాడు. ఇదే ఊపు మీద పుష్ప2 కూడా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నాడు.

Allu Arjun Serious Meeting About Pushpa

పుష్ప (Pushpa) పాన్ ఇండియా లెవల్లో హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు అల్లు అర్జున్(Allu Arjun) తగ్గేదే లే అంటున్నాడు. ఇదే ఊపు మీద పుష్ప2 కూడా పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నాడు.

అల్లు అర్జున్(Allu Arjun)  - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పుష్ప (Pushpa). దాదాపు 5 భాషల్లో పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన ఈమూవీ సంచలన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, బాలీవుడ్ లోను 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక వీటితో పాటు తమిళ, మలయాళ , కన్నడ భాషల్లోను అద్భఉతమైన విజయాన్ని.. వసూళ్లను రాబట్టింది పుష్ప(Pushpa)  సినిమా.

మొదటి సారి పాన్ ఇండియాకు వెళ్ళిన బన్నీ(Allu Arjun) కి మర్చిపోలేని  బహుమతి లభించింది. అటు అన్ని భాషల్లో ఇప్పుడు బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దాంతో పుష్ప2 (Pushpa)  ని కూడా లేట్ చేయకుండా పరుగులు పెట్టించాలి అని చూస్తున్నాడు అల్లు అర్జున్(Allu Arjun). ఇప్పటికే కథ, నటీనటులు రెడీగా ఉన్నారు. సెకండ్ పార్ట్ కొసం కొంచెం షూటింగ్ కూడా చేసి ఉంచుకున్నారట టీమ్.

దాంతో ఈ మూవీ షూటింగ్ ఫాస్ట్ గానే కంప్లీట్ అంవుతుంది అని నమ్ముతున్నారు. ఇక వచ్చే నెల నుంచి పుష్ప2 సినిమా షూటింగును మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ తో బన్నీ (Allu Arjun)   రీసెంట్ గా మీటింగును ఏర్పాటు చేశాడట. వచ్చేనెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి 4 నుంచి 6 నెలల్లో షూటింగు పార్టు పూర్తిచేయాలని  సీరియస్ గా చెప్పాడట.

అంతే కాదు గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి రిపిట్ కాకుండ చూసుకుని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుందామని అనుకున్నట్టు సమాచారం. ఈసారి పుష్ప(Pushpa)  పార్ట్ 1 కంటే గట్టిగా టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారట టీమ్. ఇక  సాధ్యమైనంత వరకూ ఈ సినిమాను దసరా బరిలో దింపాలనే అభిప్రాయాన్నిఅల్లు అర్జున్(Allu Arjun)  వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

 
అనుకోగానే సరిపోతు ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను గురించి సుకుమార్ టీమ్ తో బన్నీ(Allu Arjun)   చాలా సేపు చర్చించాడని సమాచారం. ఎలాగైనా ఈ ఏడాది పుష్ప(Pushpa)  పార్ట్ 2 ను రిలీజ్ చేయాల్సిందే అని బన్నీ పట్టుదలతో ఉన్నాడట. అంతే కాదు ఈ సారి బాలీవుడ్ లో ముందు నుంచే  భారీ ప్రమోషన్స్ చేసుకునే విధంగా ప్లాన్ చేయాలి అనుకుంటున్నారు టీమ్. దీని కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిందే అన్నాడట Allu Arjun.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈమూవీ మ్యూజిక్ సెన్సేషనల్ హిట్ అయింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా పాటలను ఇమిటేట్ చేస్తూ..ఎన్నో వీడియోల చేశారు ఫ్యాన్స్. కామన్ పీపుల్  దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ బన్నీని ఇమిటేట్ చేశారు. బన్నీ రఫ్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపించిన ఈ సినిమలో మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్ తో పాటు, సునిల్ , అనసూయ, అజయ్ ఘోష్, అజయ్, శత్రు లాంటి ప్రముఖులు నటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios