రంగస్థలం చూడాలంటే కండిషన్స్ అప్లై అంటున్న బన్నీ

allu arjun says conditions apply to watch rangasthalam
Highlights

బన్నీ తెలివిగా అలా ప్లాన్ చేశాడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ చరిత్ర సృష్టిస్తోంది. రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ గా చెప్పుకుంటున్న ఈ  సినిమా పై టాలీవుడ్ సెలెబ్రెటీలంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే మెగా క్యాంప్ హీరో అల్లు అర్జున్ ఇప్పటివరకు ఈసినిమా పై ప్రశంసలు కురిపించకపోవడం మెగా అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది.

 

రామ్ చరణ్, అల్లు అర్జున్ ల మధ్య బయటపడని ఒక చిన్న గ్యాప్ ఉంది అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఇప్పటికి కూడ చరణ్ ‘రంగస్థలం’ చూడకపోవడం అదేవిధంగా ఈమూవీ పై కామెంట్ చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

 

ఇది చాలదు అన్నట్లుగా బన్నీ తనకొడుకు అయాన్ పుట్టినరోజు వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అయాన్ పుట్టినరోజుకు సమయం కేటాయించిన చరణ్ ‘రంగస్థలం’ విషయంలో బిజీగా ఉన్నాడా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బన్నీ ఈమౌనం వెనుక ఒక కారణం ఉంది అన్నవార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ కొద్దిరోజుల క్రితమే తన కుటుంబ సభ్యులతో తన అమెరికా విహారయాత్ర నుండి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. 


 

‘రంగస్థలం’ ఘనవిజయం తరువాత ఈసినిమాను చూడమని చరణ్ చెప్పినా తాను చూడటానికి చరణ్ కొన్ని కండిషన్స్ పెడుతున్నట్లు సమాచారం. ఈమూవీని తాను తన హోమ్ థియేటర్ లో చూడనని తన తల్లి నిర్మల అదేవిధంగా చరణ్ తల్లి సురేఖలతో కలిసి తాను ఆర్టీసి క్రాస్ రోడ్ లోని ఒక థియేటర్ లో జనం మధ్య కూర్చుని మెగా అభిమానులతో కలిసి ఎంజాయ్ చేస్తూ ‘రంగస్థలం’ సినిమాను చూస్తానని దానికి ఏర్పాట్లు చేయమని చరణ్ ను కోరినట్లు సమాచారం.

 

ఇక ఇప్పటికే అల్లు శిరీష్ ‘రంగస్థలం’ సినిమాను చూసి ప్రశంసలు కురిపించిన నేపధ్యంలో బన్నీ కూడ ఈమూవీని అదేవిధంగా చరణ్ ను ప్రసంసిస్తే మెగా అభిమానులు శాంతించే ఆస్కారం ఉంది. వచ్చేనెలలో విడుదల కాబోతున్న ‘నాపేరు సూర్య’ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్న బన్నీ... ఇలా తన తల్లితో పాటు చరణ్ తల్లి సురేఖతో కూడా కలిసి సినిమా చూసేస్తే.. మెగా అభిమానులు తన సినిమాపై నెగిటివ్ టాక్ ప్రచారం చేయరనే నమ్మకంతో వున్నారు.

loader