Asianet News TeluguAsianet News Telugu

అత్తగారి ఇంట్లో అల్లు అర్జున్... గ్రాండ్ గా సంక్రాంతి సెలబ్రేషన్స్, వైరల్ అవుతున్న ఫోటోలు

ప్రతీ సంక్రాంతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అల్లు అర్జున్. అయితే ప్రతీ సారి మెగాస్టార్ ఇంట్లో నే సెలబ్రేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. కాని ఈసారి మాత్రం పండక్కు అత్తగారింటికి వెళ్ళాడు పుష్ప. 

Allu Arjun Sankranti Celebrations With Sneha Family
Author
First Published Jan 16, 2023, 5:01 PM IST

ప్రతీ సంక్రాంతి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు అల్లు అర్జున్. అయితే ప్రతీ సారి మెగాస్టార్ ఇంట్లో నే సెలబ్రేషన్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. కాని ఈసారి మాత్రం పండక్కు అత్తగారింటికి వెళ్ళాడు పుష్ప. 

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అత్తగారింట్లో సందడి చేశాడు. సంక్రాంతి పండగ వేళ తన భార్య స్నేహారెడ్డి ఫ్యామిలీతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్.  అల్లు అర్జున్ ఎప్పుడూక మెగా ఫ్యామిలీతోనే పండగలు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటుంటుంటారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ ఇంటికి వెళ్ళి.. యంగ్ మెగా హీరోలంతా సందడి చేస్తుంటారు. అందులోనే బన్నీ తన ప్రియమైన కుటుంబంతో గడపడానికి ఇష్టపడతాడు. కాని ఈసారి కాస్త కొత్తగా సంక్రాంతిని సెలబ్రేట్ చేశాడు అల్లు అర్జున్. 

 

తన ప్రియమైన కుటుంబంతో సంక్రాంతి పండుగను జరుపుకున్నాడుఅల్లు అర్జున్. అత్తగారింటో.. బంధువుల మధ్య తన భార్య అల్లు స్నేహా రెడ్డితో కలిసి.. తన పిల్లలతో సంక్రాంతిని గ్రాంగ్ గా సెలబ్రేట్ చేశారు బన్నీ. అయితే ఈఫోటోలను  తన ఇన్‌స్టాగ్రామ్రలో పోస్ట్ చేశారు స్నేహారెడ్డి.   సంక్రాంతి సందర్భంగా తీసిన మరికొన్ని పిక్స్ ను కూడా ఆమె  షేర్ చేయడం జరిగింది.

అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి వారి తల్లిదండ్రులు ఇతరులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆ ఫోటోలు  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.  ఇక సినిమాల విషయానికి వస్తే.. బన్నీ ప్రస్తుతం దృస్టి అంతా పుష్ప సీక్వెల్  సినిమాపైనే పెట్టాడు.  త్వరలో పుష్ప ది రూల్ సెట్స్‌లో జాయిన్ కానున్నాడు అల్లు. పుష్ప మూవీ అందించి సక్సెస్ జోష్ తో సీక్వెల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలె కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా  నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు రాక్ స్టార్  దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios