Asianet News TeluguAsianet News Telugu

'దాక్కో దాక్కో మేక'.. పుష్ప రికార్డుల ఊచకోత మొదలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర హంగామా మొదలయింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పుష్ప ది రైజ్ మొదటి భాగంగా రిలీజ్ కానుంది.

Allu Arjun's pushpa first single Dakko dakko meka creating new records
Author
Hyderabad, First Published Aug 13, 2021, 3:41 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర హంగామా మొదలయింది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో పుష్ప ది రైజ్ మొదటి భాగంగా రిలీజ్ కానుంది. క్రిస్టమస్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. 

కాగా శుక్రవారం ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ ని తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేశారు. దేవిశ్రీ అద్భుతమైన బీట్, అల్లు అర్జున్ మాస్ మేకోవర్, చంద్రబోస్ పవర్ ఫుల్ లిరిక్స్ తో దాక్కో దాక్కో మేక సాంగ్ క్యాచీగా ఉంది. భూమ్మీద ఉన్న ప్రతి జీవి బ్రతకడం కోసం మరొక జీవిని చంపక తప్పదు అనే అర్థం వచ్చేలా చంద్రబోస్ ర్లిరిక్స్ అందించారు. 

ఈ సాంగ్ యూట్యూబ్ లో అప్పడే రికార్డుల వేట మొదలు పెట్టింది. అతి తక్కువ సమయంలో వేగంగా 4 లక్షల లైకులు సొంతం చేసుకున్న సాంగ్ గా దాక్కో దాక్కో మేక రికార్డ్ సృష్టించింది. కేవలం 182 నిమిషాలలోనే ఈ ఫీట్ ని అందుకోవడం సరికొత్త రికార్డ్. 

ఈ సాంగ్ పై దర్శకుడు సంపత్ నంది, రచయిత కోనవెంకట్ ప్రశంసలు కురిపించారు. సాంగ్ వైల్డ్ టచ్ తో అద్భుతంగా ఉందని అన్నారు. పుష్ప అని రికార్డులని అధికమిస్తుందని సంపత్ నంది అన్నారు.ఇలాంటి బన్నీని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని కోనవెంకట్ అన్నారు. 

ఈ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios