స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా మొదలైంది.  ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్. గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పది రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో లాంచ్ అయన ఈ చిత్రం... బుధవారం(ఏప్రిల్ 24) నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఈ విషయాన్ని సినిమాకు సంగీతం అందిస్తున్న ఎస్‌.ఎస్‌ తమన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ.. త్రివిక్రమ్‌, బన్నీకి సంబంధించిన  ఫొటోలను పోస్ట్‌ చేశారు. 

ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది.  పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. హారిక-హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. బన్నీ, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రాబోతున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహించిన ‘దువ్వాడ జగన్నాథమ్‌’ చిత్రంలో నటించారు.

'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాల విజయాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ లాంటి  పెద్ద నిర్మాతలు చేస్తున్న మూవీ కావటంతో ట్రేడ్ లోనూ మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.