స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలతో పాటు బన్నీ ఫ్యామిలీకి కూడా సమానమైన సమయాన్ని కేటాయిస్తుంటాడు. భార్య, పిల్లలతో గడిపేందుకు ఇష్టపడుతుంటాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Birthday to my cutest angel Arha baby 😘 #alluarha #happy3

A post shared by Allu Arjun (@alluarjunonline) on Nov 21, 2019 at 12:41am PST

నేడు అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ పుట్టినరోజు. అర్హ తన క్యూట్ లుక్స్ తో ఇప్పటికే సోషల్ మీడియా క్వీన్ గా మారిపోయింది. అల్లు అర్జున్ తరచుగా తన కుమార్తెతో అల్లరిచేస్తూ, ఆడుకుంటూ ఉండే దృశ్యాలని అభిమానులతో పంచుకుంటుంటాడు. 

నేడు అల్లు అర్హ బర్త్ డే కావడంతో అభిమానులు పెద్దఎత్తున సోషల్ మీడియాలో విషెష్ తెలియజేస్తున్నారు. అర్హ బర్త్ డే విషెష్ ట్వీట్లతో ట్విట్టర్ మోతెక్కుతోంది. '#HBDAdorableAlluArha' అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్ లో టాప్ లో ఉంది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు బన్నీ కూతురు ఇప్పుడే ఎంత క్రేజ్ తెచ్చుకుందో అని. 

అల వైకుంఠపురములో చిత్రంలోని 'ఓ మై గాడ్ డాడీ' అనే పాట టీజర్ లో బన్నీ పిల్లలు అర్హ, అల్లు అయాన్ కనిపించారు. బన్నీ ఫోటోని కొడుతూ క్యూట్ గా ఉన్న సాంగ్ టీజర్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించింది. నవంబర్ 22న సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నారు.