నవంబర్ నుంచి `పుష్ప2` యాక్షన్ జాతర.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
అల్లు అర్జున్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం వెళ్లారు. అనంతరం ఇండియా రాగానే `పుష్ప2` షూటింగ్ కొత్త షెడ్యూల్‌ని స్టార్ట్ చేయబోతున్నారట.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. బన్నీ ఇటలీ వెళ్లిన నేపథ్యంలో దర్శకుడు బ్రేక్ ఇచ్చారు. తిరిగొచ్చాక.. కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. నవంబర్ 2 నుంచి కొత్త షెడ్యూల్‌ని ప్రారంభిస్తారట. బన్నీ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు.
ఇదిలా ఉంటే దీనికోసం భారీ సెట్ కూడా వేశారట. ఇది చాలా పెద్ద షెడ్యూల్ అని తెలుస్తుంది. నాన్ స్టాప్‌గా సినిమా చిత్రీకరణ జరుపబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా యాక్షన్ సీన్లు తీయబోతున్నారట. జాతర సెట్‌లో ఈ ఫైట్స్ సీన్లు తీయనున్నారట. అందుకోసం భారీగా జాతర సెట్‌ని కూడా వేశారని సమాచారం. ఇందులో భారీ ఫైట్‌తోపాటు, యాక్షన్ సీన్‌కి ముందు వచ్చే సీన్లని తీస్తారట. అంతేకాడు ఈ షెడ్యూల్‌లోనే ఓ సాంగ్‌ని కూడా చిత్రీకరించడానికి సుకుమార్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ షూటింగ్ సినిమాలో మేజర్ పార్ట్ ని పోషిస్తుందని తెలుస్తుంది.
ఇక `పుష్ప` మొదటి భాగం పెద్ద హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆడియెన్స్ నుంచి భారీ డిమాండ్ ఉంది. ఇండియానే కాదు, అంతర్జాతీయ ఆడియెన్స్ నుంచి కూడా దీనికి క్రేజ్ నెలకొంది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు, మ్యానరిజాన్ని అంతా ఫాలో అవుతున్నారు, సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్నారు. దీంతో రెండో పార్ట్ ని మరింత భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు సుకుమార్. కథ స్కేల్‌ని పెంచారు, గ్రాండియర్ నెస్‌ని పెంచారు. పాత్రలు కూడా యాడ్ కాబోతున్నాయని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. వీరితోపాటు ఒకరిద్దరు పాపులర్ యాక్టర్స్ కూడా ఈ చిత్రంలో మెరుస్తారని టాక్. మరి అందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈచిత్రాన్ని వచ్చే ఏడాది ఇండిపెండెన్స్ డే రోజుని విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.