#Pushpa2 తెలుగు వెర్షన్ కు ఆ రేటు గిట్టుబాటు అవుతుందా?
సలార్ రిలీజ్ కు ముందు నిర్మాతలు 200Cr కి రైట్స్ కోట్ చేసారు కానీ 160Cr డీల్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంతే కాదు మొత్తం ఎమౌంట్ NRAకు
‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) కు ఉన్న పిచ్చ క్రేజ్ కు బిజినెస్ ఓ రేంజిలో జరుగుతుందని అందరూ అంచనా వేస్తారు. అందులో నిజం కూడా ఉంది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఒకేసారి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనే వ్యూహంతో నిర్మాణం చేపడుతున్నారు. ఫస్ట్ పార్ట్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా పుష్ప మేనరిజమ్‌తోనూ, డైలాగ్‌తోనూ ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ఆ రెస్పాన్స్ ని దృష్టిలో ఉంచుకునే కొనసాగింపుగా వస్తున్న ‘పుష్ప: ది రూల్’ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించడంతోపాటు, ఒకేసారి పలు భాషల్లో విడుదల చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు నిర్మాతలు. ఈ క్రమంలో కేవలం తెలుగు రెండు రాష్ట్రాల నుంచే 200 కోట్ల దాకా బిజినెస్ ఎక్సపెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. RRR చిత్రం తెలుగులో రెండువందల కోట్లు బిజినెస్ చేసింది. ఇప్పుడు పుష్ప 2 కూడా అలాగే చేయాలని లెక్కలేసుకుని నిర్మాతలు రంగంలోకి దిగినట్లు ఫిల్మ్ నగరవర్గాల సమాచారం.
సలార్ రిలీజ్ కు ముందు నిర్మాతలు 200Cr కి రైట్స్ కోట్ చేసారు కానీ 160Cr డీల్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. అంతే కాదు మొత్తం ఎమౌంట్ NRAకు ఇవ్వలేదు. కొంత నెగోషియేషన్స్ జరిగాయి. నైజాంలో సలార్ బ్రేక్ ఈవెన్ అవుతోంది కానీ ఆంద్రాలో కష్టమని తేలింది. ఇప్పుడు పుష్ప 2 కు కూడా థియేటర్ రైట్స్ కు 200 కోట్లు తెలుగు వెర్షన్ కు నిర్మాతలు కోట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే పుష్ప పార్ట్ 1 హిందీ బెల్ట్ లో వర్కవుట్ అయ్యినట్లుగా తెలుగులో కలెక్ట్ చేయలేకపోయిందని కాబట్టి అంత రేటు ఇవ్వలేమని బయ్యర్లు చెప్తున్నారట.
తెలుగులో పుష్ప 1 చిత్రం 110 కోట్ల షేర్ తో ముగిసింది. ఈ రీజన్స్ చూపుతూ..బయ్యర్లు ఇంత రిస్క్ ని భరించలేమని అంటున్నారట. ఆంధ్రా ఆరు ఏరియాలకు కలిపి 100కోట్లు కు అడుగుతున్నారుట. నైజాం లో దాన్ని బట్టి 70 కోట్లుకు ప్లాన్ చేసుకోమని చెప్తున్నారు. ఏదైమైనా సంక్రాంతికి గుంటూరు కారంకు వచ్చే కలెక్షన్స్ ని బట్టి డీల్స్ ఫైనలైజ్ అయ్యే అవకాసం ఉంది.
‘పుష్ప: ది రూల్’ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓవర్ సీస్ ఎంక్వైరీలు మొదలయ్యాయి. ‘పుష్ప2’ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ 100 కోట్లు చెప్తున్నట్లు సమాచారం. మరో ప్రక్క ప్రభాస్ ప్రతిష్టాత్మక చిత్రం #Salaar ఓవర్ సీస్ రైట్స్ 72 కోట్లు కు ఫైనల్ చేసారు. ఇప్పుడు ‘పుష్ప2’ రైట్స్ రేటు ఫైనల్ కాకపోనప్పటికీ ... పెద్ద మొత్తమే అంటున్నారు.
ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహాద్ ఫాజిల్ ఆ అంచనాలను పెంచేశారు. రెండో భాగంలో భన్వర్ సింగ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఇక ఈ సీక్వెల్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. 2021లో విడుదలై సూపర్‌హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్’ (పుష్ప 2). అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది.