#Pushpa ‘పుష్ప’పై ఈ వార్త నిజమేనా ?ఎక్కడ విన్నా ఇదే టాపిక్
2021లో విడుదలై సూపర్‌హిట్ అందుకున్న ‘పుష్ప: ది రైజ్’కి కొనసాగింపుగా తెరకెక్కుతున్నదే ‘పుష్ప: ది రూల్’ (పుష్ప 2). అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది.
ప్రస్తుతానికి పుష్ప 'ది రూల్' పేరుతో రెండో భాగం తెరకెక్కుతుండగా 'ది రోర్' పేరుతో మూడో భాగాన్ని తీసుకొస్తారని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ ఇప్పటికే బన్నీ, సుక్కు, మైత్రి అధినేతలు చేద్దాం అన్నట్టుగా డిసైడ్ అయ్యారని అంటున్నారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ ని తారాస్థాయికి వెళ్లింది. ఈ సినిమాతో బన్నీ ...నేషనల్ అవార్డు సైతం తెచ్చుకున్నాడు . తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషలలో పుష్ప చిత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లోనే ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రం సీక్వెల్ పుష్ప : ది రైజ్ పైన ప్రేక్షకులకు ప్రస్తుతం అంచనాలు భారీగా ఉన్నాయి.
పుష్ప: ది రూల్ సినిమాకి రెండో భాగం అనగా పుష్ప: ది రైజ్ ఎండ్ కార్డ్ వేస్తుంది అనుకున్నారు అందరూ. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని తెలుస్తోంది. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ తరువాత వచ్చే భాగానికి పుష్ప రోర్ అని టైటిల్ ని కూడా అనుకుంటున్నారట. ఇలా మూడు పార్టులుగా సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు అంటున్నారు. ధర్డ్ పార్ట్ అంటే వినటానికి బాగానే ఉంది కానీ దీన్ని తెరకెక్కించాలంటే ముందుగా సెకండ్ పార్ట్ క్లిక్ అవ్వడం చాలా అవసరం.
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు, వాటికి సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. 'పుష్ప'కి కూడా ముందుగానే సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు మూడో భాగం అన్నది కొత్తగా వచ్చిన ప్రచారం. ఈ మూడో భాగం కథ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. మొదటి పార్టులో పుష్ప ఎలా ఎదిగాడు అని చూపించిన సుకుమార్.. రెండో పార్టులో ఎలా తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు అని చూపించి ఆ తరువాత మూడో భాగంలో తన సామ్రాజ్యం కోసం పుష్ప చేసే యుద్ధంతో మూవీని ముగించబోతున్నారని సమాచారం.
రెండో భాగంలో జపాన్ ఎపిసోడ్, జాతరలో బన్నీ చీర కట్టు ఫైట్ ఓ రేంజ్లో ఉండనుందని టాక్ వినిపిస్తోంది. ఫహద్ ఫాజిల్ - అల్లు అర్జున్ మధ్య ఫైట్స్‌ను మూడో భాగంలోనే ఎక్కువగా చూసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు పరిచయం కాని చాలా కొత్త పాత్రలు కూడా ఎంట్రీ ఇస్తాయని చెబుతున్నారు. దీని బట్టి పుష్పను టాలీవుడ్లో ఒక పవర్ ఫుల్ బ్రాండ్‌గా మార్చేందుకు సుక్కు సినిమాను గట్టిగానే చెక్కుతున్నారని అర్థమవుతోంది.
‘పుష్ప: ది రూల్’ సినిమా విషయానికి వస్తే భారీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని మాత్రం భారత్‌లో విడుదల చేసిన రోజునే, ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించింది. రష్యాతోపాటు... 20కి పైగా దేశాల్లో సినిమాని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘పుష్ప2’ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహాద్ ఫాజిల్ ఆ అంచనాలను పెంచేశారు. రెండో భాగంలో భన్వర్ సింగ్ పాత్ర ఎక్కువగా ఉంటుందని చెప్పారు. హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయన్నారు. ఇక ఈ సీక్వెల్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.